Sajjala : పవన్ కల్యాణ్ బలహీనతకు ఇది నిదర్శనం

జనసేనకు 24 స్థానాలు ఇవ్వడం, ఆ 24 మంది కూడా ఎవరో చెప్పలేని దుస్థితి వారికి ఉందన్న సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు

Update: 2024-02-24 12:10 GMT

జనసేనకు 24 స్థానాలు ఇవ్వడం, ఆ 24 మంది కూడా ఎవరో చెప్పలేని దుస్థితి వారికి ఉందన్న సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బీజేపీతో కూడా పొత్తుకుదిరితే తన అభ్యర్థులనే పంపిస్తాడామో. నని ఎద్దేవా చేశారు. మాస్టర్‌ ప్లానింగ్‌ అంతా చంద్రబాబే చేస్తారని, బీజేపీతో పొత్తు అర్జంటుగా పెట్టుకోవాలనే ఉద్ధేశం, కాంగ్రెస్‌కు ఫైనాన్స్‌ చేయించి పరోక్షంగా వైఎస్సార్సీపీ ఓట్లు చీల్చాలని చూస్తున్నారని అన్నారు. జగన్‌ కి ఉన్న పాజిటివిటీని కొద్దిగైనా తగ్గించాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నాడు. – రాష్ట్రానికి ఇది చేయగలను అని కానీ, 2014–19 మధ్య ఇది చేశాను అని చెప్పుకోలేని దౌర్భాగ్యం చంద్రబాబుదని అని సజ్జల అన్నారు. అలాంటి ఎత్తిపోయిన కేసుకు మద్దతుగా పవన్‌ కల్యాణ్‌ వెళ్లడం ఆయన బలహీనత, దరిద్రం. బీజేపీతో పొత్తు కోసం దింపుడు కల్లం ఆశ అని అన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఆత్రంపడుతున్నారు.

టీడీసీకి అనుబంధ సంస్థగానే...
పవన్‌ కల్యాణ్‌.. వందకు 100 శాతం తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా నడుస్తున్నారనేది మరోసారి తేటతెల్లమైందన్నారు. వాళ్లు ఎన్ని జిమ్మిక్కులు చేసినా 87 శాతం జగన్‌ గారి సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయన్న సజ్జల రాష్ట్రంలో అన్ని సీట్లు గెలుచుకుంటూ కుప్పంలో కూడా విజయం వైపు తాము అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఒక రాజకీయ పార్టీగా పేరు పెట్టుకుని, తన సామాజికవర్గాన్ని, అభిమానుల్ని ఇలా మోసం చేయడం దారుణమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయనపై జాలి కంటే ఆయన్ను అభిమానించే వారిని చూస్తే జాలి కలుగుతుందన్నారు. అసలు ఒక పార్టీలా కూడా వ్యవహరించలేని పరిస్థితి పవన్‌ కళ్యాణ్‌ది అని అననారు. జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో కూడా చంద్రబాబే చెప్తున్నారని, 24 సీట్లు ఇస్తామని చెప్పారు.
పార్టీ నిర్మాణం...
పార్టీ నిర్మాణం, నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిలను పెట్టుకునే ప్రయత్నం, కింది స్థాయి కమిటీలు కూడా వేయలేని దుస్థితి పవన్ కల్యాణ్ ది అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. దీనికి కారణం రానున్న కాలంలో డిమాండ్‌ పెరిగి చంద్రబాబుకు ఇబ్బంది కలుగుతుందనే నిర్మాణం చేసుకోలేదన్నారు. కేవలం జనసేన పార్టీ పేరు, గాజు గ్లాసు గుర్తు మాత్రం పెట్టుకుని తిరుగుతున్నారని అన్నారు. ఇక ఆలోచించుకోవాల్సింది పవన్‌పై ఆశలు పెట్టుకున్న వారు మాత్రమేనని సజ్జల అన్నారు. వారికి వారు ఆలోచించుకుని రియలైజ్‌ కావాలి.ఎత్తిపోయిన టీడీపీకి పవన్ మద్దతా..? అని ప్రశ్నించారు. ఇన్నాళ్లు అధికారంలో ఉన్న టీడీపీ 175కి 175 మంది అభ్యర్థులను ప్రకటించుకోలేని దుస్థితి చంద్రబాబుదని అన్నారు.


Tags:    

Similar News