నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. మే నెలలో ఆలస్యంగా వేసవి సెలవులు ఇచ్చిన ప్రభుత్వం తొలుత ఈ నెల 4వతేదీ వరకూ పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. అయితే 4వ తేదీన ప్రధాని మోదీ పర్యటన ఉండటంతో ఒకరోజు సెలవును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావడంతో సిలబస్ వేగంగా పూర్తి చేయాలని ఉపాధ్యాయులకు ఆదేశాలు అందాయి.
అదనంగా వేసవి సెలవులు...
సహజంగా జూన్ మూడు, నాలుగో మాసంలో పాఠశాలలను తిరిగి తెరుస్తారు. అయితే ఆలస్యంగా వేసవి సెలవులు ఇవ్వడంతో ఈసారి జులై మొదటి వరకూ పాఠశాలలు తెరుచుకోలేదు. ఈసారి 22 రోజులు అదనంగా సెలవులు లభించాయి. పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు.