Tdp : హైకోర్టులో అయ్యన్న పాత్రుడికి ఊరట

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడుకు హైకోర్టులో ఊరట లభించింది;

Update: 2022-02-24 08:21 GMT
ayyannapatrudu, tdp, chief minister, high court
  • whatsapp icon

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడుకు హైకోర్టులో ఊరట లభించింది. అయ్యన్నపై తదుపరి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పోలీసులకు ఆదేశించింది. అయ్యన్న పాత్రుడికి పశ్చిమ గోదావరి జిల్లా నలజర్ల పోలీసులు 41 ఎ కింద నోటీసులు ఇచ్చారు. ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. నిన్న రాత్రంతా నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుడి నివాసం వద్దనే పోలీసులు వేచి ఉన్నారు. అయితే అయ్యన్న ఇంట్లో లేరని కుటుంబ సభ్యులు చెప్పడంతో వారు అర్థరాత్రి వరకూ ఉండి వెళ్లిపోయారు.

ముఖ్యమంత్రిపై.....
ముఖ్యమంత్రి జగన్ పై అయ్యన్న పాత్రుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 18వ తేదీన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభలో ఆయన మాట్లాడుతూ జగన్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై నలజర్ల పోలీసులు అయ్యన్న పాత్రుడిపై కేసు నమోదు చేశారు. పోలీసులు అరెస్ట్ చేస్తారని తెలిసి హైకోర్టులో అయ్యన్న పాత్రుడు క్వాష్ పిటీషన్ వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు అయ్యన్నపై తదుపరి చర్యలు నిలిపేయాలని ఆదేశించింది.


Tags:    

Similar News