Andhra Pradesh : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. లడ్డూ వివాదం నేపథ్యంలో

ఆంధ్రప్రదేశ్ లో ఎఫ్ఎస్ఎస్ఐఐ ల్యాబ్ లను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

Update: 2024-10-08 14:09 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎఫ్ఎస్ఎస్ఐఐ ల్యాబ్ లను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం 48 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ల్యాబ్ లు చేయడానికి ఒప్పందం కుదరింది. తిరుమల, కర్నూలులో ఈ ఎఫ్ఎస్ఎస్ఐఐ ల్యాబ్ లు ఏర్పాటు చేయడానికి నిర్ణయం జరిగిపోయింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు పెట్టారు.

లడ్డూ వివాదం నేపథ్యంలో...
తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో ఏపీ సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆహార కల్తీని ఇక్కడే పరీక్షించేందుకు వీలవుతుంది. రిపోర్టులు కూడా వెంటనే అందేందుకు మార్గం సుగమమవుతుంది. టీటీడీ లడ్డూ వివాదం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ల్యాబ్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తమవుతుంది.


Tags:    

Similar News