YSRCP : వైసీపీ షాకింగ్ డెసిషన్.. ఎన్నికలకు దూరం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. కృష్ణా, గుంటూరు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీల ఎన్నిక బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. తాము ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు పేర్ని నాని తెలిపారు.
బహిష్కరిస్తున్నామని...
కూటమి ప్రభుత్వం తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ వేధింపులకు గురి చేస్తుందని అందుకు నిరసనగా తాము ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలను సజావుగా సాగేలా ఈ ప్రభుత్వం చేయదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్ని నాని తెలిపారు. ధర్మబద్ధంగా ఎన్నికను నిర్వహించే అవకాశం లేదన్న అభిప్రాయంతోనే తాము ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు పేర్ని నాని తెలిపారు. టీడీపీ నేతలకు పోలీసులు సహకరిస్తూ వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం దుర్మార్గమమని పేర్ని నాని తెలిపారు.