తిరుమల లడ్డూ విచారణ ప్రారంభం
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై విచారణ ప్రారంభం అయింది
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై విచారణ ప్రారంభం అయింది.నిన్ననే సుప్రీంకోర్టు నియమించిన కమిటీ అమరావతి లో సమావేశమైంది. ఇప్పటికే సిట్‌లో సభ్యులుగా సీబీఐ నుంచి సీబీఐ హైదరాబాద్ డైరెక్టర్ ఎస్.వీరేష్‌ప్రభు, విశాఖపట్నం సీబీఐ ఎస్పీ ఆర్. మురళి.ఏపీ ప్రభుత్వం నుంచి సభ్యులుగా ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, డీఐజీ గోపీనాథ్ జెట్టి ఉన్నారు.
ఎక్కడి నుంచి?
అయితే ఫుడ్ అండే సేప్టే నుంచి ఇంకా అధికారిని నియమిచంలేదు. తిరుపతిలో సిట్ కోసం ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తిరుమలకు వెళ్లి ఈ సిట్ బృందం త్వరలోనే విచారణ ప్రారంభించనుంది. ముందుగా ఎక్కడి నుంచి విచారణ ప్రారంభించాలన్న దానిపై సమావేశం అయినట్లు తెలిసింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నుంచి వివరాలను తీసుకుని దానిని కూడా పరిశీలించినట్లు తెలిసింది.