స్టెల్లా షిప్ సీజ్ చేయడం కుదరదని పరోక్షం గా చెప్పిన కలెక్టర్

కాకినాడ పోర్టులోస్టెల్లా షిప్ సీజ్ చేయడం కుదరదని జిల్లా కలెక్టర్ పరోక్షంగా చెప్పారు

Update: 2024-12-17 11:49 GMT

కాకినాడ పోర్టులోస్టెల్లా షిప్ సీజ్ చేయడం కుదరదని జిల్లా కలెక్టర్ పరోక్షంగా చెప్పారు. రేషన్ బియ్యం కిందకి అన్ లోడ్ చేసిన తరువాత షిప్ పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. స్టెల్లా ఎల్ పనామా షిప్ లో12 శాంపిల్స్ సేకరించామన్న ఆయన ముందు షిప్ లో ఉన్న రేషన్ బియ్యం కిందకి దింపి తర్వాత లోడ్ చేస్తామని చెప్పారు. షిప్ లో 640 టన్నుల రేషన్ బియ్యం ఉన్నాయని మొదట అనుకుంటే ..పరీక్షలు చేసిన తర్వాత 1320 టన్నులు రేషన్ బియ్యం ఉన్నట్లు తేలిందన్నారు.



ఫస్ట్ అన్ లోడ్ చేసి...

ఆ బియ్యాన్ని మొదట అన్ లోడ్ చేస్తామని, అసలు ఏ రైస్ మిల్లు నుంచి ఆ బియ్యం వచ్చాయో తేలాలని కలెక్టర్ అన్నారు. ఆ లోడ్ సత్యం బాలాజీ అనే ఎక్సపర్టర్స్ కి చెందినది గా గుర్తించామని కలెక్టర్ తెలిపారు.దీనిపై ఇంకా విచారణ కొనసాగుతుందన్న ఆయన స్టెల్లా షిప్ సీజ్ చేసే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే పరోక్షంగా తాము షిప్ ను సీజ్ చేయలేమని చెప్పారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now 



Tags:    

Similar News