Breaking: సుప్రీంలో జగన్ సర్కార్ కు ఊరట
అమరావతి రాజధాని పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది;
అమరావతి రాజధాని పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఆరు నెలల్లో అమరావతి పనులను పూర్తి చేయాలన్న ఆదేశాలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. రాజధాని హైకోర్టు తీర్పుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. శాసన వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నారని పిటీషన్ లో పేర్కొంది.
విచారణను 31వ తేదీకి...
దీనిపై రాజధాని రైతులు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును కొనసాగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని రాజధాని రైతులు కోరారు. రెండు పిటీషన్లను విచారించిన హైకోర్టు ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. విచారణను వచ్చే నెల 31వ తేదీకి వాయిదా వేసింది.