ఉచిత ఇసుకపై జేసీ సంచలన కామెంట్స్

టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన దగ్గర పనిచేేసే వాళ్లే ఇసుక వ్యాపారం చేస్తున్నారన్నారు;

Update: 2024-08-27 05:53 GMT
jc prabhakar reddy , municipal chairman,  RTPP flyash
  • whatsapp icon

తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన దగ్గర పనిచేేసే వాళ్లే ఇసుక వ్యాపారం చేస్తున్నారన్నారు. తన అనుచరులు ఇరవై ఐదు మంది వరకూ ఇసుక వ్యాపారం చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ పనులు ఆపాలని, ఎందుకు మీరే సంపాదించుకోవాలా? నేను సంపాదించుకోవద్దా? అని ప్రశ్నించారు.

ఇసుక దందా వద్దంటూ...
కానీ తన నియోజకవర్గంలో ఇసుక దందా వద్దని తన కోసం ఐదు సంవత్సరాలు పని చేశారని, కావాలంటే వేరే విధంగా సహాయం చేస్తా కానీ ఇసుక దందాను మానేయాలంటూ హితవు పలికారు. ఇసుకను తోలితే బండ్లను బయటకు రానివ్వని అన్నారు. ఇసుక వ్యాపారం చేసి తనకు దూరం కావద్దంటూ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.


Tags:    

Similar News