అమరావతి గెలుస్తుంది.. ఇదే ఫైనల్
అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు.;
అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. రాజధాని ప్రారంభం జరిగి ఈరోజుకు ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. తెలుగు జాతి గుండె చప్పుడుగా అమరావతి నగరం నిలుస్తుందని ఆనాడు అందరం ఆకాంక్షించామని చంద్రబాబు ట్వీట్ చేశారు. పాలకుల తుగ్లక్ ఆలోచనల కారణంగా అంతా నాశనమయిందని ఆయన అన్నారు.
ఎన్ని కుతంత్రాలు చేసినా...
ఎన్నికలకు ముందు అమరావతిని స్వాగతించిన వ్యక్తి అధికారంలోకి రాగానే మాట మార్చి మోసం చేశాడన్నారు. అమరావతి రైతుల మహాపాదయాత్రపై వైసీపీ కుతంత్రాలు సాగవని తెలిపారు. ఆంధ్రుల రాజధాని అమరావతేనని పేర్కొన్నారు. అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంటుందని, ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరుతుందని అభిప్రాయపడ్డారు. న్యాయం, నిజం, త్యాగం ఉన్న అమరావతే గెలుస్తుందని, ఇది ఫైనల్ అని ఆయన ట్వీట్ చేశారు.