జైలులోనే నేడు దీక్ష
గాంధీ జయంతి రోజు సందర్భంగా నేడు టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైలులో ఒకరోజు నిరాహార దీక్ష చేయనున్నారు
గాంధీ జయంతి రోజు సందర్భంగా నేడు టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైలులో ఒకరోజు నిరాహార దీక్ష చేయనున్నారు. తనపై అక్రమ కేసులను బనాయించి అరెస్ట్ చేసినందుకు నిరసనగా కూడా ఈ దీక్ష చేపట్టనున్నారు. అయితే దీక్షకు జైలులో చంద్రబాబు దీక్షకు అధికారులు అనుమతిస్తారా? లేదా? అన్నది చూడాలి. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నందుకు నిరసనగా జైలులోనే ఒకరోజు దీక్ష చేయాలని చంద్రబాబు నిర్ణయించడంతో కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది.
భువనేశ్వరి, లోకేష్ కూడా...
మరోవైపు రాజమండ్రిలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా నిరాహారదీక్ష చేయనున్నారు. తన భర్త, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. అయితే పోలీసులు ఇంతవరకూ అనుమతి ఇవ్వలేదు. మరి దీనపై భువనేశ్వరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి. మరోవైపు ఢిల్లీలో నారా లోకేష్ కూడా ఒకరోజు దీక్ష చేస్తున్నారు. లోకేష్ తో పాటు టీడీపీ నేతలు కూడా దీక్షలో పాల్గొనననున్నారు. సత్యమేవ జయతే నినాదంతో ఈ దీక్షలు చేపట్టనున్నారు.