జగన్ సర్కార్ అడ్డగోలు నిర్ణయాలు
విద్యార్థులను అడ్డుకోవడం అమానుషమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు;
విద్యార్థులను అడ్డుకోవడం అమానుషమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానలపై టీఎన్ఎస్ఎఫ్ పోరాటం చేస్తుందన్నారు. వారు తలపెట్టిన ఆగ్రహ దీక్షను అడ్డుకోవడమేంటని నారా లోకేష్ ప్రశ్నించారు. జగన్ నియంత పాలనకు నిదర్శనమని ఆయన అన్నారు నారా లోకేష్. దీక్ష చేసేందుకు పోలీసులను అనుమతి కోరినా ఇవ్వకుండా కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారన్నారు.
వారిని విడుదల చేయండి....
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న టీఎన్ఎస్ఎఫ్ నేతలను అరెస్ట్ చేశారని, వారిని వెంటనే విడుదల చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు. అక్రమ అరెస్ట్ లను ఖండిస్తున్నామని చెప్పారు. విద్యావ్యవస్థను జగన్ ప్రభుత్వం నాశనం చేసిందని అన్నారు. అడ్డగోలు నిర్ణయాలతో భ్రష్టుపట్గించిందని ఫైర్ అయ్యారు. పాఠశాలల విలీన ప్రక్రియను వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు.