నేడు శ్రీశైలంలోకి యువగళం
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు శ్రీశైలం నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు 97వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకూ లోకేష్ 1223 కిలోమీటర్ల దూరం నడిచారు. ప్రస్తుతం నందికొట్కూరు నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర కొనసాగుతుంది. నేడు శ్రీశైలం నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించనుంది. ఉదయం 7గంటలకు రాత్రి బస నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. 7.20 గంటలకు కృష్ణారావుపేటలో గ్రామస్తులతో సమావేశం అయ్యారు. వారి సమస్యలపై చర్చించారు. 9.00 గంటలకు రుద్రవరంలో మైనారీటీలతో సమావేశం అయ్యారు. ఉదయం 10.10 గంటలకు పాములపాడులో రైతులతో సమావేశం కానున్నారు.
సమావేశాలు ముగించుకుని...
10.40 గంటలకు పాములపాడు శివార్లలో ఎస్సీలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. 11.40 గంటలకు పాములపాడులో భోజన విరామానికి ఆగుతారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభం కానుంది.4.15 గంటలకు కంభాలపల్లెలో గ్రామస్తులతో మాటామంతీ కార్యక్రమంలో లోకేష్ పాల్గొంటారు. 5.05 గంటలకు ఎర్రగూడురులో గ్రామస్తులతో సమావేశం కానున్నారు. అనంతరం శ్రీశైలం నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది. 5.55 గంటలకు నందికొట్కూరు - శ్రీశైలం సరిహద్దుల్లో స్థానికులతో భేటీ కానున్నారు. 6.30 గంటలకు కె.స్టార్ గోడౌన్ వద్ద లోకేష్ బస చేయనున్నారు.