రైతులను ఇలా అవమానిస్తారా?

వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధానిని పట్టించుకోలేదని టీడీపీ అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ అన్నారు;

Update: 2022-09-10 07:30 GMT

వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధానిని పట్టించుకోలేదని టీడీపీ అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ అన్నారు. వైసీపీ రాబందులు మరోసారి రాజధానిపై పడ్డారన్నారు. అమరావతిని ఎడారి, గ్రాఫిక్స్ అంటూ అవమానించారని గ్రీష‌్మ మండి పడ్డారు. అటువంటి భూములను మళ్లీ అమ్ముకునేందుకు ప్రయత్నించడమేంటని ఆమె ప్రశ్నించారు. హైకోర్టు ఆరు నెలల్లో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని చెప్పినా నేటికీ పనులు ప్రారంభించలేదన్నారు.

దండయాత్ర అంటూ...
ప్రభుత్వానికి భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం మొండి చేయి చూపించిందన్నారు. వారిని రోడ్డు మీదకు తీసుకు వచ్చింది జగన్ ప్రభుత్వం కాదా? అని గ్రీష్మ ప్రశ్నించారు. రైతులపై అక్రమ కేసులు పెట్టడంతో పాటు వారి చేతులకు బేడీలు వేసిన ఘనత కూడా జగన్ ప్రభుత్వానిదేనని అన్నారు. రైతులు చేసే పాదయాత్రను దండయాత్ర అంటున్నారని, ఇది మరోసారి రైతులను అవమానించడమేనని గ్రీష్మ మండిపడ్డారు.


Tags:    

Similar News