TDP : తమ నేతకు టిక్కెట్ ఇవ్వాలంటూ టీడీపీ నేత పురుగుల మందు తాగి?
నరసరావుపేట టిక్కెట్ ను అరవిందబాబుకు ఇవ్వాలంటూ టీడీపీ కార్యకర్త ఆత్మహత్యకు ప్రయత్నించారు
TDP :నరసరావుపేట టిక్కెట్ ను అరవిందబాబుకు ఇవ్వాలంటూ టీడీపీ కార్యకర్త ఆత్మహత్యకు ప్రయత్నించారు. పురుగుల మందు తాగిన రామిరెడ్డిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నరసరావుపేట టీడీపీ టిక్కెట్ ను అరవిందబాబుకే ఇవ్వాలంటూ టీడీపీ నేతలు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు.
లావు కృష్ణదేవరాయలదే బాధ్యత...
అయితే ఆయనకు కాకుండా మరొకరికి సీటు ఇస్తారని చెప్పి ప్రచారం జరగడంతో అరవిందబాబు అనుచరుడు రామిరెడ్డి తన ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అరవిందబాబుకు టిక్కెట్ రాకుంటే ఆ బాధ్యత లావు శ్రీకృష్ణదేవరాయలదే పూర్తి బాధ్యత అంటూ అరవింద బాబు అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం రామిరెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.