Andhra Pradesh : నేడు ఏపీలో ఎన్నిక.. అక్కడ స్కూళ్లకు సెలవులు
ఆంధ్రప్రదేశ్ లో టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రారంభమయింది. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది.
ఆంధ్రప్రదేశ్ లో టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రారంభమయింది. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకూ జరుగుతుంది. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమయింది. ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఉప ఎన్నికలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన 16,377 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు.
9న కాకినాడలో కౌంటింగ్...
రెండు ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో ఇందుకోసం 116 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 9న కాకినాడ జేఎన్టీయూలో ఈ ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ను ఏర్పాటు చేశారు. ఈరోజు రెండు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రయివేటు టీచర్లు కూడా ఈ ఓటింగ్ లో పాల్గొననుండంతో ప్రయివేటు స్కూళ్లు యాజమాన్యం కూడా సెలవు ఇవ్వాలని నిర్ణయించారు.