Chacnrababu : నేడు ఉత్తరాంధ్రకు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రజాగళం సభల్లో పాల్గొననున్నారు.;

Update: 2024-04-23 02:17 GMT
Chacnrababu : నేడు ఉత్తరాంధ్రకు చంద్రబాబు
  • whatsapp icon

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రజాగళం సభల్లో పాల్గొననున్నారు. నేడు ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటన సాగనుంది. ఉత్తరాంధ్రలో అత్యధిక స్థానాలను సాధించే దిశగా చంద్రబాబు ఇక్కడ తన సభలతో జనాలను పార్టీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మహిళలతో ముఖాముఖి...
ఈరోజు చంద్రబాబు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తారు. విజయనగరం జిల్లాలోని గజపతి నగరం నియోజకవర్గం మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలోని పాతపట్నం, ఆముదాలవలసలో జరిగే ప్రజాగళం సభల్లో చంద్రబాబు పాల్గొని ప్రసంగించనున్నారు.


Tags:    

Similar News