నేడు ప్రకాశంలో చంద్రబాబు పర్యటన

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేటి నుంచి మూడు రోజుల పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు;

Update: 2023-04-19 02:52 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేటి నుంచి మూడు రోజుల పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు గిద్దలూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నిన్న కడపలో జోన్ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు నేడు గిద్దలూరుకు చేరుకుంటారు. అక్కడ ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం విజయవంతం కోసం పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు.

రేపు మార్కాపురంలో...
రేపు మార్కాపురంలో చంద్రబాబు తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటారు. రేపు మార్కాపురం, ఎల్లుండి యర్రగొండపాలెంలో చంద్రబాబు పర్యటించనున్నారు. పార్టీ అధినేత వస్తుండటంతో పెద్దయెత్తున జనసమీకరణకు నేతలు సిద్ధమవుతున్నారు. పశ్చిమ ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉండటంతో చంద్రబాబు అక్కడే ఫోకస్ పెట్టారు.


Tags:    

Similar News