మహిళ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్
మహిళ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
మహిళ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మహిళ ఉద్యోగినులు తమ పిల్లల సంరక్షణ కోసం సెలవులను 60 నుంచి 180 రోజులకు పెంచింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 11వ వేతన సవరణ సంఘం సిఫార్సుల మేరకు ఈ సెలవులను పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సెలవులను పెంచుతూ....
ఉద్యోగినుల పిల్లలు వయసు ఆరు నెలల నుంచి ఏడు నెలలోపు ఉంటే ఆరు నెలల సెలవు, తొమ్మిది నెలల పైన ఉంటే మూడు నెలల సెలవు తీసుకోవచ్చు. ఇక దత్తత తీసుకునే వారికి కూడా ఈ సెలవులను వర్తింప చేశారు. దత్తత తీసుకునే బిడ్డ వయసు నెల రోజుల లోపు ఉంటే ఏడాది వరకూ సెలవు తీసుకోవచ్చు. ఈ సెలవు రోజులకూ పూర్తి జీతం పొందవచ్చు. దత్తత తీసుకునే ఉద్యోగినులకు ఇప్పటికే ఇద్దరు పిల్లలుంటే ఈ ఉత్తర్వుల వర్తించవు.