24 గంటల్లో కుండపోత వర్షం
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుడం రానున్న 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశముంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుడం రానున్న 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశముంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడన ప్రభావంతో కోస్తాలోని కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. తీరం వెంట 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదముందని హెచ్చరించింది.
మత్స్యకారులు వేటకు...
మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ప్రభుత్వం హెచ్చరకిలు జారీ చేసింది. గత రెండు రోజులుగా వర్షాలు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొరలుతున్నాయి. ప్రాజెక్టులకు నీరు చేరుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు సోమశిల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో సోమశిల ప్రాజెక్టు గేట్ల ద్వారా 60,453 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సోమశిల ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 77.9 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 69.1 టీఎంసీలుగా ఉంది.