Tirumala : నేడు తిరుమలలో క్యూ లైన్ లు ఎక్కడ వరకూ ఉందో తెలుసా?
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. నిన్నటి వరకూ స్వల్పంగా ఉన్న భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. నిన్నటి వరకూ స్వల్పంగా ఉన్న భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారింది. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు స్వామి వారి దర్శనం మూడు నంుచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
24 గంటలపాటు...
నిన్న తిరుమల శ్రీవారిని 72,986 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 33,482 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.79 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. నేడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ నిండి క్యూ లైన్ ఏటీజీ వరకూ విస్తరించింది. సర్వదర్శనం క్యూ లైన్ లో టోకెన్లు లేకుండా ప్రవేశించని భక్తులకు నేడు స్వామి వారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది.