తిరుమల శ్రీవారి సెప్టంబర్ ఆదాయమెంతంటే?

తిరుమల శ్రీవారి సెప్టంబరు ఆదాయం 122.19 కోట్ల రూపాయలు అని అధికారులు తెలిపారు

Update: 2022-10-09 06:40 GMT

తిరుమలకు సెప్టంబరు నెలలో భక్తులు పోటెత్తారు. సెప్టంబరు నెలలో విపరీతంగా భక్తులు తిరుమల కొండకు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారి సెప్టంబరు ఆదాయం 122.19 కోట్ల రూపాయలు. అన్న ప్రసాదాలు 4.47 లక్షల మంది భక్తులు స్వీకరించారని అధికారులు తెలిపారు.

భక్తులు కొండకు...
సెప్టంబరు నెలలో మొత్తం 21.12 లక్షల మంది తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. 98.44 లక్షల మంది లడ్డూ ప్రసాదాలను అందజేసినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలు జరగడంతో తిరుమలలో గత నెల రద్దీ ఎక్కువగా ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.


Tags:    

Similar News