Andhra Pradesh : నేడు గన్నవరంలో హైందవ శంఖారావం

నేడు గన్నవరంలోని కేసరపల్లిలో హైందవ శంఖారావం జరుగుతుంది.;

Update: 2025-01-05 02:40 GMT

నేడు గన్నవరంలోని కేసరపల్లిలో హైందవ శంఖారావం జరుగుతుంది. రాష్ట్ర చరిత్రలో నిలిచేలా విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో తలపెట్టిన హైందవ శంఖారావానికి భారీ ఏర్పాట్లు చేశారు. గన్నవరం మండలం కేసరపల్లిలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు జరిగే సభావేదిక పరిరాలను అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు.కేసరపల్లిలో భారీ బహిరంగ సభ నేడు జరగనుంది.


మూడు లక్షల మంది ....

ఈ హైందవ శంఖారావానికి దేశం నలుమూలల నుంచి వివిధ ప్రాంతాల నుంచి రైళ్లలోనూ, వివిధ మార్గాల ద్వారా విజయవాడకు చేరుకోన్నారు. సుమారు మూడు లక్షల మంది సభకు హాజరవుతారని అంచనా. ఈ మేరకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ముఖ్యఅతిథులుగా విశ్వహిందూ పరిషత్‌ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్‌కుమార్, అయోధ్య రామ మందిరం ట్రస్టీ గోవింద్‌దేవ్‌ మహరాజ్, వీహెచ్‌పీ కార్యనిర్వాహక కార్యదర్శి మిలింద్‌ పరందే వివిధ మఠాలకు చెందిన స్వామీజీలు పాల్గొననున్నారు.


ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now



Tags:    

Similar News