Vijayawada : బెజవాడ వైసీపీ నేతల చుట్టూ ఉచ్చు బిగిస్తున్న పాత కేసులు.. తిరగదోడి మరీ ?

గత ఐదేళ్లుగా జరిగిన ఘటనలపై విజయవాడ వైసీపీ నేతలు, కార్యకర్తల చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు

Update: 2024-07-05 04:25 GMT

గత ఐదేళ్లుగా జరిగిన ఘటనలపై విజయవాడ నేతలు, కార్యకర్తల చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. వరసకేసులతో బెజవాడ వైసీపీ నేతలు బెంబేలెత్తిపోతున్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరొకలా వ్యవహరించిన పోలీసులు ఇప్పుడు తాజాగా కేసులు రీ ఓపెన్ చేసి మరీ నిందితుల కోసం వెదుకుతున్నారు. కొందరిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేస్తున్నారు. మరికొందరిపై మళ్లీ కేసులు నమోదు చేస్తున్నారు.

పార్టీ కార్యాలయంపై...
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన వారిని కొందరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. మరికొందరిని ఈ ఘటనలో కేసు నమోదు చేస్తున్నారు. వైసీీపీ నేతలు దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేష్ ల పాత్ర ఉందని ఇప్పటికే నిర్ధారించిన పోలీసులు టీడీపీ కార్యాలయంపై దాడితలో వీరి ప్రమేయం ఉందని గుర్తించారు. వీరిపై కేసులు నమోదు చేయడానికి సిద్ధమవుతున్నారు. త్వరలోనే వీరి ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది.
చెన్నుపాటి గాంధీపై...
విజయవాడలో టీడీపీ నేత చెన్నుపాటి గాంధీపై దాడి చేసిన దేవినేని అవినాష్ అనుచరుడు ఈశ్వర్ ప్రసాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడి కేసులో గత ప్రభుత్వంలో ఈశ్వర్ ప్రసాద్ పై కేసు నమోదు కాలేదు. ఆయనను దాడి కేసులో ఏ3గా చేర్చారు. తర్వాత తొలగించారు. ప్రస్తుతం ఏ5గా కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం రిమాండ్ ను తిరస్కరించింది. ఈ దాడిలో చెన్నుపాటి గాంధీ కన్నుకు తీవ్ర గాయమయింది. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
కేశినేని చిన్నిపై...
మరో వైపు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పై దాడి చేసిన ఘటనలో కూడా కొందరు వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. వైసీపీ కార్యకర్తలు కాలసాని చెన్నారవు, చిమటా రామకృష్ణ, వెంకటేశ్వర్లు, గోపాలకృష్ణలను అరెస్ట్ చేశారు. ఈ ఏడాది మే 13న కేశినేనిచిన్ని తిరువూరు పర్యటనకు వచ్చినప్పుడు ఆయనపై జరిగిన దాడిలో వీరున్నారంటూ ఎమ్మెల్యే శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా వరస కేసులు బెజవాడ వైసీపీ నేతలను చుట్టుముడుతున్నాయి.


Tags:    

Similar News