Ys Jagan : నేడు బెంగళూరు నుంచి తాడేపల్లికి జగన్

వైసీపీ అధినేత జగన్ నేడు బెంగళూరు నుంచి విజయవాడకు రానున్నారు.;

Update: 2024-08-06 02:14 GMT
Ys Jagan : నేడు బెంగళూరు నుంచి తాడేపల్లికి జగన్
  • whatsapp icon

వైసీపీ అధినేత జగన్ నేడు బెంగళూరు నుంచి రానున్నారు. ఆయన గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడ నుంచి రైజ్ ఆసుపత్రికి వెళ్లి అక్కడ ప్రత్యర్ధుల దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్తను పరామర్శించనున్నారు. అక్కడి నుంచి నేరుగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఎల్లుండి నంద్యాల వెళతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఎల్లుండి నంద్యాల వెళ్లి...
నంద్యాల వెళ్లి అక్కడ హత్యకు గురైన వైసీపీ నేత సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శిస్తారు. నేటి నుంచి జగన్ క్యాంప్ ఆఫీస్ లో వైసీపీ కార్యాలయం ప్రారంభం కానుంది. కొత్త కార్యాలయం నుంచి నేటి నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. వైసీపీ నేతలు, జగన్ కూడా కార్యకర్తకు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేశారు.


Tags:    

Similar News