జగన్ వార్నింగ్ ఇచ్చిన ఆరుగురు మంత్రులు వీరే

వైఎస్ జగన్ ఈరోజు నిర్వహించిన గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఆరుగురు మంత్రులు వెనకబడి ఉన్నారని తేల్చి చెప్పారు

Update: 2022-12-16 14:16 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు నిర్వహించిన గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఆరుగురు మంత్రులు వెనకబడి ఉన్నారని తేల్చి చెప్పారు. వారు తమ పనితీరును మార్చుకోవాలని చెప్పారు. ప్రతి ఇంటికి వెళ్లి ఐదు నిమిషాలు వారితో మాట్లాడితే తిరిగి గెలిచే అవకాశాలున్నాయని చెప్పారు. పదహారు నెలల సమయం ఎన్నికలకు ఉందని, అన్ని ఇళ్లకు తిరిగి వారికి మనం ఉన్నామని భరోసా ఇస్తేనే తిరిగి విజయం సాధ్యమవుతుందని తెలిపారు.

వెనకబడి ఉన్నారని...
అయితే గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఆరుగురు మంత్రులు తమ పనితీరును మెరుగు పర్చుకోవాలని కోరారు. ఆ ఆరుగురు మంత్రుల్లో బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, విడదల రజనీ, గుమ్మనూరి జయరాం, గుడివాడ అమరనాధ్, సీదిరి అప్పలరాజులు ఉన్నారు. వీరు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పూర్తిగా వెనకబడి ఉన్నారని జగన్ చెప్పారు. వీరితో పాటు 26 మంది ఎమ్మెల్యేల పేర్లను కూడా ఆయన సమావేశంలో బయటపెట్టారు. దీంతో మంత్రులు ఖచ్చితంగా పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందేనని జగన్ స్పష్టం చేసినట్లు తెలిసింది.


Tags:    

Similar News