Gold Price Today : బంగారం కొనాలనుకునే వారికి ఇదే కరెక్ట్ టైం
నేడు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి.;

బంగారం ధరలు మరింత ప్రియమవుతాయన్న మార్కెట్ నిపుణుల హెచ్చరికలు నిజమవుతున్నాయి. రోజురోజుకూ ధరలు పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. బంగారం ధరలు పెరగడం మామూలే అయినప్పటికీ గతంలో ఎన్నడూ ఈ రేంజ్ లో ధరలు పెరగకపోవడంతో వినియోగదారులు కూడా షాక్ కు గురవుతున్నారు. ప్రతి రోజూ ధరల్లో మార్పు కనిపిస్తుంది. ఆ ధరల్లో మార్పులో పెరుగుదల తప్పించి తగ్గుదల కనిపించడం లేదు. అందుకే బంగారం ధరలు ఏ సీజన్ లో పెరగని, ఏ సంవత్సరం లేని ధరలు ఏడాది చూస్తున్నామని, ఇది కొంత ఇబ్బందికరమైన వాతావరణమేనని వ్యాపారులు కూడా అంగీకరిస్తున్నారు.
దక్షిణాది రాష్ట్రాల్లోనే...
బంగారం, వెండి వస్తువులు ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాల్లోనే విక్రయాలు జరుగుతాయి. ఈ ప్రాంతాల సంస్కృతి సంప్రదాయాలను అనుసరించి పెళ్లిళ్లు, శుభకార్యాలకు బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడం ఆనవాయితీగా, సంప్రదాయంగా వస్తుంది. అయితే అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బంణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధాలు వంటి కారణాలతో పాటు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాద్యతలను స్వీకరించిన తర్వాత బంగారం, వెండి ధరలకు అదుపు లేకుండా పోతుంది. ప్రతి రోజూ ధరలు పెరుగుతూ వినియోగదారులను నిరాశ పరుస్తున్నాయి. దీంతో కొనుగోళ్లు కూడా భారీగా తగ్గాయి.
స్థిరంగా ధరలు...
బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయాలంటే ఇప్పుడు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందన్న భావన నెలకొంది. అందుకే చాలా మంది జ్యుయలరీ దుకాణాల వైపు చూసేందుకు కూడా జంకుతున్నారని వ్యాపారులు చెబుతున్నారు. ఈ ఏడాది పది గ్రాముల బంగారం లక్ష రూపాయలకు చేరుకునే అవకాశముందని కూడా అంచనాలు ఉన్నాయి. నేడు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. మధ్యాహ్నానికి మార్పులు జరిగే అవకాశముండవచ్చు. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 82,300 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 89,780 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,10,000 రూపాయలకు చేరుకుంది.