Gold Price Today: స్వీట్ న్యూస్... బంగారం ధరలు దిగివస్తున్నాయ్.. ఇంకా దిగుతాయటగా?
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా అంతేస్థాయిలో తగ్గు ముఖంపట్టాయి.
బంగారం ధరలు ఎప్పుడూ ప్రియంగానే ఉంటాయి. ధరలు పెరగడం బంగారానికి ఉన్నంత స్పీడ్ మరే వస్తువుకు ఉండదు. భూముల ధరల్లో కూడా కొంత నిదానంగా పెరుగుదల ఉంటుంది. భూముల ధరలు పెరగాలంటే సంవత్సరాల తరబడి వెయిట్ చేయాలి. కానీ బంగారం విషయంలో అలా కాదు. ప్రతి రోజూ ధరలు పెరుగుతుంటాయి. అనేక కారణాలతో ధరలు పెరుగుతుండటం ఆందోళన కనిపిస్తున్నప్పటికీ, కొనకుండా మాత్రం ఉండలేని మానసిక స్థితి మహిళలది. ఎందుకంటే బంగారం అంటే అంత పిచ్చి. అంత మక్కువ. బంగారాన్ని తమ ప్రాణ సమానంగా మగువలు చూసుకుంటారు. అది ఉంటే చాలు ఎటువంటి ప్రేమ, ఆప్యాయతలు అవసరం లేదని భావించే వారు కూడా లేకపోలేదు.
మరింత ప్రియమవుతాయన్నా...
ముఖ్యంగా మన దేశంలో బంగారం ధరలు మరింత ప్రియంగా ఉంటాయి. బంగారం, వెండి వస్తువులకు భారత్ లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో ఏ చిన్న శుభకార్యమైనా, చివరకు బర్త్ డే పార్టీకి కూడా బంగారం వస్తువును గిఫ్ట్ గా ఇవ్వడం అలవాటయింది. అలాంటి పరిస్థితుల్లో బంగారం కొనుగోళ్లు నిరంతరం సీజన్ తో సంబంధం లేకుండా జరుగుతూనే ఉంటాయి. అందునా దక్షిణ భారతదేశంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కేరళ, కర్ణాటక, తమినాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం దుకాణాలు వీధికొకటి కనిపిస్తాయి. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కూడా తమ శాఖలను ఎక్కువ సంఖ్యలో ఈ ప్రాంతంలో ప్రారంభించడానికి ఇక్కడ వినియోగదారులు ఎక్కువగా ఉండటమే కారణం.
ధరలు తగ్గడంతో...
బంగారం, వెండి ధరలు పెరగడానికి కేవలం డిమాండ్ పెరగడమే కాదు. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు కూడా ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే గత రెండు రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. వెండి అయితే రెండు రోజుల్లో నాలుగు వేల రూపాయలు తగ్గింది. ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా అంతేస్థాయిలో తగ్గు ముఖంపట్టాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,390 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 77,880 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 99,900 రూపాయలుగా నమోదయింది.