Year Ender 2023: ఈ ఏడాదిలో బ్యాంకింగ్ వ్యవస్థలో 4 కీలక మార్పులు

ఇక మరో వారం రోజుల్లో 2023వ సంవత్సరం ముగియనుంది. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టనున్నాము. అయితే ఈ ఏడాదిలో అనేక..

Update: 2023-12-22 12:52 GMT

Year Eender-2023

ఇక మరో వారం రోజుల్లో 2023వ సంవత్సరం ముగియనుంది. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టనున్నాము. అయితే ఈ ఏడాదిలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మార్పులు సామాన్య ప్రజలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. ఈ ఏడాదిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకింగ్ వ్యవస్థలో అనేక మార్పులను తీసుకువచ్చింది. మరి ఎలాంటి మార్పులు వచ్చాయో తెలుసుకుందాం.

రూ.2వేల నోట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం:

ఈ ఏడాది మే 19న రూ.2000 నోట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 2,000 నోటు చెలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ తెలిపింది. మార్కెట్లో చెలామణిలో ఉన్న నోట్లను వెనక్కి రప్పించేలా చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది. దీంతో అన్ని నోట్ల కూడా బ్యాంకులకు చేరాయి. నోట్లను పూర్తిగా నిషేధించనప్పటికి వాడుకలో లేకుండా చేసింది ఆర్బీఐ. రూ.2000 నోట్లను తిరిగి ఇవ్వడానికి లేదా మార్చుకోవడానికి దాదాపు 4 నెలల సమయం ఇచ్చారు. ఇప్పటి వరకు 97 శాతం నోట్లు వెనక్కి వచ్చినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా తెలిపింది.

UPIలో కీలక మార్పులు:

ఈ ఏడాది UPI చెల్లింపు లావాదేవీల పరిమితిని రిజర్వ్ బ్యాంక్ పెంచింది. యూపీఐ లావాదేవీ పరిమితిని రూ. 1 లక్ష నుండి రూ. 5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలలలో UPI లావాదేవీల కోసం ఈ సౌకర్యం అందిస్తోంది.

రెపోరేటులో పెంపు లేదు:

ఏప్రిల్ నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన అన్ని మానిటరీ పాలసీ సమావేశాల్లో రెపో రేటులో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం రెపో రేటు 6.5 శాతంగా ఉంది. రెపో రేటును చివరిసారిగా ఫిబ్రవరి 2023లో పెంచారు. సరళంగా చెప్పాలంటే, ద్రవ్యోల్బణం మరియు ప్రజల జేబులను దృష్టిలో ఉంచుకుని, RBI EMI ధరను పెంచలేదు.

అసురక్షిత రుణాలపై RBI చర్యలు:

రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మీ జేబుపై భారం మరింత పెరగనుంది. రానున్న రోజుల్లో క్రెడిట్ కార్డులు లేక వినియోగదారుల రుణాలు తీసుకోవడానికి ప్రజలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆర్బీఐ ఇప్పుడు బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు వినియోగదారుల క్రెడిట్ రుణాల రిస్క్ వెయిటేజీని 25 శాతం పెంచింది. అంటే అసురక్షిత రుణాలు మునిగిపోతాయనే భయం దృష్ట్యా, బ్యాంకులు ఇప్పుడు మునుపటి కంటే 25 శాతం ఎక్కువ కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిలకు వినియోగదారుల క్రెడిట్ రిస్క్ వెయిటేజీ 100 శాతంగా ఉంది. ఇప్పుడు దానిని 125 శాతానికి పెంచారు.



Tags:    

Similar News