Gold Price Today : భగ్గుమంటున్న బంగారం ధరలు.. ఆల్ టైం హైకి చేరుకోవడంతో?

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి;

Update: 2025-04-12 03:35 GMT
gold rates today in hyderabad,   silver , prices, india
  • whatsapp icon

బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఆల్ టైం రికార్డులకు చేరుకుంటున్నాయి. మొన్నటి వరకూ తగ్గినట్లే అనిపించిన బంగారం, వెండి ధరలు మళ్లీ ఒక్కసారిగా పరుగు అందుకున్నాయి. వేలల్లో పెరుగుదల ఉండటంతో తగ్గిన ధరలన్నీ ఒక్కసారి ఎటూ పనికి రాకుండా పోయాయి. బంగారం ధర ఇప్పటికే 96 వేల రూపాయలకు పైగానే చేరుకుంది. అంటే లక్ష రూపాయలకు చేరుకోవడానికి ఇంకా పెద్దగా సమయం పట్టదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వెండి ధరలు కూడా అదేస్థాయిలో పెరుగుతుండటం కొంత ఆందోళనకు గురి చేస్తుంది. బంగారం, వెండి ధరలు ఇకపై పేద, మధ్యతరగతికి మాత్రమే కాదు.. ఎగువ మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులో ఉండదన్నది అర్థమయిపోయింది.

ఒకప్పుడు అందరికీ...
ఒకప్పుడు బంగారం ధరలు అందరికీ అందుబాటులో ఉండేవి. బంగారం, వెండి అంటే పిచ్చి కాబట్టి కాస్త కాస్త పొదుపు చేసి మరీ కొనుగోలు చేసేవారు. ఎక్కువ మంది మధ్యతరగతి ప్రజలు మాత్రమే అత్యధికంగా బంగారాన్ని, వెండిని కొనుగోలు చేస్తుంటారు. తమ భవిష్యత్ కు భద్రత ఉండటమే కాకుండా, బంగారం కొనుగోలు చేస్తే నష్టం రాదని భావించి ఎక్కువ మంది మధ్యతరగతి ప్రజలు బంగారంపై పెట్టుబడి పెట్టేవారు. అలాంటి వర్గం ఇప్పుడు పెరుగుతున్న ధరలతో బంగారానికి దూరమయింది. అంటే ఈ ధరల పెరుగుదల ప్రభావం ఖచ్చితంగా అమ్మకాలపై పడుతుంది. అదే సమయంలో సంపన్నులు కొనుగోలు చేసినా ఆశించిన స్థాయిలో వ్యాపారాలు సాగవన్నది వ్యాపారులు చెబుతున్న మాట.
ఈరోజు ధరలు ఇలా...
బంగారం అంటే స్టేటస్ సింబల్ గా అందరూ భావిస్తారు. కానీ ఇప్పుడు బంగారం లేకపోయినా బతకగలమని, దానిని కొనుగోలు చేయడం కన్నా మరొక దానిపై పెట్టుబడి పెట్టడం మంచిదని ఎక్కువ మంది భావిస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రామల బంగారం ధరపై దాదాపు 1800 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 87, 450 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 95,400 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,08,000 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News