Gold Price Today : షాక్ ల మీద షాక్ లు ఇస్తున్న గోల్డ్ రేట్స్.. ఇక కొనడం కష్టమే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీ పెరుగుదల కనిపించింది.;

బంగారం ధరలు తగ్గుతాయని ఎవరు అంచనాలు వేశారో కానీ...తగ్గడం మాత్రం అటుంచి భారీగా పెరుగుతున్నాయి. పది గ్రాముల బంగారం ధర త్వరలోనే యాభై ఐదు వేల రూపాయలకు చేరుకుంటుందని బిజినెస్ ఎక్స్ పెర్ట్స్ అంచనాలు నిజమయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే గత రెండు రోజులుగా బంగారం, వెండి ధరలు దూసుకుపోతున్నాయి. కొన్నాళ్లు తగ్గినట్లే కనిపించి మళ్లీ పరుగును అందుకోవడంతో ఇక ధరలు తగ్గే అవకాశం లేదని అనిపిస్తుంది. బిజినెస్ నిపుణుల అంచనాలు కూడా నిజం అయ్యే అవకాశం ఎంత మాత్రం కనిపించడం లేదు. ధరలు తగ్గుతాయేమోనని ఆశగా ఎదురు చూస్తున్న వారికి పెరుగుతున్న ధరలు చూసి నిరాశ చెందుతున్నారు.
ధరలు తగ్గుతాయని...
చాలా మంది ధరలు తగ్గుతాయని భావించి కొనుగోళ్లను వాయిదా వేసుకోవడంతో బంగారం, వెండి అమ్మకాలు దాదాపుగా నిలిచిపోయాయని చెప్పాలి. దీంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. గతంలో ఇదే సీజన్ లో విపరీతంగా అమ్మకాలు ఉండేవని, ఈ సీజన్ లో పెళ్లిళ్లు, శుభకార్యాలు బాగా జరుగుతున్నప్పటికీ అమ్మకాలు మందకొడిగానే సాగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ట్రంప్ ఎఫెక్ట్ తో బంగారం ధరలకు కళ్లెం పడుతుందని ఆశించినా ఇంకా ధరలు పెడరగం తప్ప తగ్గేదేమీ ఉండదని పెరుగుతున్న ధరలను బట్టి చూస్తే అర్థమవుతుంది. అనేక కారణాలు పెరుగుదలకు చెబుతున్నప్పటికీ ఇప్పటికే బంగారం ధరలు అందుకోలేనంత స్థాయికి వెళ్లిపోయాయి.
భారీగా పెరిగి...
బంగారం ధరలు ఇప్పటికే 93 వేలుకు చేరుకున్నాయి. వెండి ధరలు కూడా 1,07,000 రూపాయలు వరకూ పలుకుతుంది. నిన్న అయితే పది గ్రాముల బంగారం ధరపై ఏకంగా మూడు వేల రూపాయలు పెరిగింది. గోల్డ్ రేట్స్ స్థిరంగా లేకపోవడంతో వినియోగదారులు కొనుగోలు చేయాలా? వద్దా? అన్న మీమాంసలో ఉన్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీ పెరుగుదల కనిపించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 85,610 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 93,390 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,07,000 రూపాయలు పలుకుతుంది.