Hyderabad : చిట్టీల పులయ్య దొరికాడు
వందకోట్ల రూపాయల మేరకు ప్రజలను మోసం చేసిన కేసులో పుల్లయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు.;

వందకోట్ల రూపాయల మేరకు ప్రజలను మోసం చేసిన కేసులో పుల్లయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా యాడికి మండలానికి చెందిన పుల్లయ్య హైదరాబాద్ కు వచ్చి స్థిరపడ్డారు. కొన్ని నెలల పాటు కూలీగా పనిచేసి తర్వాత మేస్త్రీగా అవతారమెత్తాడు. అయితే తనకున్న పరిచయాలతో చిట్టీల వ్యాపారం ప్రారంభించాడు. ఐదు నుంచి యాభై లక్షల విలువైన చిట్టీలను నిర్వహించిన పుల్లయ్య అందరి నుంచి డబ్బులను దండుకుని ఉడాయించేశాడు.
చిట్టీలు వేస్తూ...
చిట్టీలు పాడుకున్న వారికి కూడా డబ్బులు చెల్లించలేదు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీఎస్ పోలీసులు దర్యాప్తు జరిపి చిట్టీల పుల్లయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21 తేదీన పరారయిన పుల్లయ్యను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పుల్లయ్యను అరెస్ట్ చేశారని తెలిసి బాధితులు పెద్దయెత్తున పోలీస్ స్టేషన్ వద్దకు క్యూ కడుతున్నారు.