Andhra Pradesh : నంద్యాలలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య
నంద్యాలలో వైసీపీ కార్యకర్త పోరే సుధాకర్ రెడ్డి హత్యకు గురయ్యారు;

నంద్యాలలో వైసీపీ కార్యకర్త పోరే సుధాకర్ రెడ్డి హత్యకు గురయ్యారు. పొలం పనికి వెళ్లగా ఆయనపై ప్రత్యర్థులు దాడి చేసి చంపారు. దీంతో సుధాకర్ రెడ్డి అక్కడికక్కడే మరణించారు. అయితే ఈ హత్యతో నంద్యాల నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా భారీగా మొహరించారు.
ఆధిపత్య పోరుతో...
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు హత్య తర్వాత జరగకుండా తగిన ముందస్తు చర్యలను పోలీసులు చేపట్టారు. అయితే పోరే సుధాకర్ రెడ్డి హత్యకు ఆధిపత్య పోరు కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. నినారాయణపురం, జేసీపాలెం మధ్య పొలానికి వెళ్లి వస్తుండగా దారికాచి ప్రత్యర్థులు చంపారు. ఈ హత్య విషయంలో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.