20 కోట్లు కాజేసిన కేటుగాళ్లు.. డిజిటల్ అరెస్ట్ అంటూ?

ఫోన్లు చేస్తూ సీబీఐ అధికారులమంటూ మోసాలు జరుగుతున్నాయని ప్రభుత్వం ఎన్ని ప్రకటనలు ఇచ్చినా మోసం మాత్రం ఆగడం లేదు.;

Update: 2025-03-21 04:26 GMT
cyber ​​criminals, 20 crore, old women,  mumbai
  • whatsapp icon

ఫోన్లు చేస్తూ సీబీఐ అధికారులమంటూ మోసాలు జరుగుతున్నాయని ప్రభుత్వం ఎన్ని ప్రకటనలు ఇచ్చినా మోసం మాత్రం ఆగడం లేదు. ప్రతి రోజూ దేశంలో ఎక్కడో ఒక చోట సైబర్ నేరానికి పాల్పడుతూనే ఉన్నారు కేటుగాళ్లు. తాజాగా డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో సైబర్‌ నేరగాళ్లు ఓ వృద్ధురాలిని రెండు నెలలు ఆమె ఇంట్లోనే బంధించి ఏకంగా .20 కోట్ల పైనే కాజేశారు. దక్షిణ ముంబయికి చెందిన 86 ఏళ్ల వృద్ధురాలిని గతేడాది డిసెంబరు 26, ఈ నెల 3వ తేదీల మధ్య సీబీఐ అధికారినంటూ ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. నగదు అక్రమ చలామణి వ్యవహారంలో డిజిటల్‌ అరెస్టయ్యారంటూ భయపెట్టారు.

ఇంట్లోనే ఉండాలంటూ...
ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని షరతు పెట్టారు.విచారణ చేస్తున్నామని, ప్రతి మూడు గంటలకు ఒకసారి తనిఖీలు చేస్తామని చెప్పి భయపెట్టారు. ఈ డిజిటల్ అరెస్ట్ నుంచి తప్పించుకోవాలంటే తమకు డబ్బులు చెల్లించాలని బెదిరిస్తూ దశల వరాీగా 20.26 కోట్లు కొట్టేశారు. చివరకు బాధితురాలు ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో, ముంబయిలోని పలు ప్రాంతాలకు చెందిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నారు.


Tags:    

Similar News