Telangana : ఆటోను ఢీకొట్టిన లారీ.. ఐదుగురి పరిస్థితి విషమం
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహబూబాబాద్ జిల్లా లో జరిగిన ప్రమాదంలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది;

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహబూబాబాద్ జిల్లా లో జరిగిన ప్రమాదంలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. నర్సింహులపేట మండలం పెద్దనాగారం స్టేజి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అనేక మంది గాయపడ్డారు. పదిహేడు మంది కూలీలతో వెళుతున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని, ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు
గాయపడిన వారిని...
గాయపడిన వారిని వెంటనే పోలీసులు అంబులెన్స్ లలో మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులు అందరూ తొర్రూర్ మండలం చెర్లపాలెం గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. మిర్చి తోట ఏరడానికి బంగ్లా వైపు వెళుతుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.