Dussehra : నగరం సగం ఖాళీ... రైల్వే స్టేషన్లన్నీ కిటకిట
దసరా పండగకు ప్రజలు సొంతూళ్ల బాట పట్టారు. దీంతో రైల్వే స్టేషన్లన్నీ కిటకిటలాడుతున్నాయి.
దసరా పండగకు ప్రజలు సొంతూళ్ల బాట పట్టారు. దీంతో రైల్వే స్టేషన్లన్నీ కిటకిటలాడుతున్నాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా మారాయి. దసరా పండగకు తెలంగాణలో నిన్నటి నుంచి సెలవులు ప్రారంభమయ్యాయి. ఈనెల 15వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో అతి పెద్ద పండగ దసరా కావడంతో దాదాపు పథ్నాలుగు రోజుల పాటు పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
సెలవులు ప్రకటించడంతో...
ఈ నేపథ్యంలో పిల్లల స్కూళ్లకు సెలవులు ప్రకటించడంతో ప్రజలు తమ గ్రామాలకు తరలి వెళుతున్నారు. దసరా పండగను తమ సొంత గ్రామాల్లో జరుపుకోవడం సంప్రదాయంగా వస్తుంది. అందులోనూ ఇన్ని సెలవులు రావడంతో ఇక నగరంతో ఏం పని. దాదాపు సగం నగరం మొత్తం ఖాళీ అయినట్లు కనిపిస్తుంది. ఇక రైల్వే స్టేషన్లు మాత్రమే కాదు.. బస్టాండ్లు కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఏపీఎస్ఆర్టీసీ, టీజీ ఆర్టీసీ అనేక ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.