Vijayawada : అక్టోబరు 3 నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు...ఏర్పాట్లు ముమ్మరం
విజయవాడ శరన్నవరాత్రి ఉత్సవాలు వచ్చే నెల మూడోతేది నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారు
విజయవాడ శరన్నవరాత్రి ఉత్సవాలు వచ్చే నెల మూడోతేది నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంద్రీకీలాద్రిపై ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. దసరా సందర్భంగా దుర్గమ్మ తల్లిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు దుర్గగుడికి వస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. క్యూలైన్లను పెద్దవిగా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమైన వారికే వీఐపీ పాస్ లను మంజూరు చేస్తున్నారు. ప్రయివేటు వాహనాలను కొన్ని దినాల్లో కొండమీదకు అనుమతించే అవకాశం లేదు.
రద్దీని దృష్టిలో పెట్టుకుని...
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వాహనాల పార్కింగ్ ను కిందనే ఏర్పాటు చేేస్తున్నారు. అక్టోబరు 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకూ వివిధ అలంకారాలలో అమ్మవారిని దర్శించుకోనున్నారు. మూలా నక్షత్రమైన అక్టోబరు 9వ తేదీన సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమివ్వనుంది. ఆరోజు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా. అందుకే భారీ బందోబస్తుతో పాటు తగిన ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైన లడ్డూ ప్రసాదాలను కూడా ఆలయ అధికారులు సిద్ధం చేస్తున్నారు.
దుర్గమ్మ అలంకారాలివే...
అక్టోబరు 3వ తేదీ గురువారం - బాలత్రిపుర సుందరీ దేవీ అలంకారం
అక్టోరు 4వ తేదీ శుక్రవారం - గాయత్రీ దేవి అలంకారం
అక్టోబరు 5వతేదీ శనివారం - అన్నపూర్ణాదేవి
అక్టోబరు 6వతేదీ ఆదివారం - లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారం
అక్టోబరు 7వ తేదీ సోమవారం - మహాచండీ దేవి అలంకారం
అక్టబోరు 8వ తేదీ మంగళవారం - మహాలక్ష్మి దేవి అలంకారం
అక్టోబరు 9వ తేదీ బుధవరాం - సరస్వతీ దేవి అలంకారం
అక్టోబరు 10వ తేదీ గురువారం - దుర్గాదేవి అలంకారం
అక్టోబరు 11వ తేదీ శుక్రవారం - మహిషాసుర మర్ధిని దేవి అలంకారం
అక్టోబరు 12వ తేదీ శనివారం - రాజరాజేశ్వరి దేవి