Telangana : తెలంగాణలో నేటి నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం

తెలంగాణ రాష్ట్రం అతి పెద్దదైన దసరా పండగకు ముస్తాబవుతుంది. ఈరోజు నుంచి బతుకమ్మ వేడుకలు ప్రారంభం కానున్నాయి.

Update: 2024-10-02 03:39 GMT

bathukamma celebrations

తెలంగాణ రాష్ట్రం అతి పెద్దదైన దసరా పండగకు ముస్తాబవుతుంది. ఈరోజు నుంచి బతుకమ్మ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు ఎంగిపూల బతుకమ్మను మహిళలు నిర్వహించుకుంటారు. బతుకమ్మ పండగను రాష్ట్రమంతా మహిళలు జరుపుకుంటారు. మొత్తం నవ రాత్రులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూలప పండగను వాడవాడలా నిర్వహిస్తారు. తెలంగాణ సాంస్కతిక పండగగా దీనిని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం కూడా బతుకమ్మను అధికారిక పండగా ప్రకటించడంతో నిధులు కూడా విడుదల చేయనుంది. బతుకమ్మ సంబరాలు నేటినుంచి తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధర్యంలో జరుగుతాయి.

ప్రభుత్వం ఏర్పాట్లు...
ప్రతిరోజూ రవీంద్ర భారతిలో సాయంత్రం ఆరు గంటలకు బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ నెల 10వ తేదీ వరకూ ఈ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. పదో తేదీన ట్యాంక్ ‌బండ్ పై జరగనున్న వేడుకలతో ముగియనుంది. రంగురంగుల పూలను బతుకమ్మగా తయారు చేసి దానిని సమీపంలోని చెరువులో నిమజ్జనం చేస్తారు. రాష్ట్రంలోని ప్రజలు ఆయురారోగ్యం, సుఖ సంతోషాలతో ఉండాలని ఈ వేడుకలను నిర్వహించడం కొన్ని దశాబ్దాలుగా వస్తుంది. ఈరోజు నుంచి దసరా ఉత్సవాలతో పాటు బతుకమ్మ పండగ కూడా ప్రారంభం కానుండటంతో మహిళలు తమ ఇళ్లను అత్యంత అందంగా అలంకరిస్తారు. బంధువులందరూ ఈ పండగకు సొంత గ్రామాలకు చేరుకుంటారు.
పది రోజుల పాటు...
అందుకే తెలంగాణ ప్రజలకు అతి పెద్ద పండగ దసరా అవుతుంది. దసరా అంటే తెలంగాణ ప్రజలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తారు. నవరాత్రులను భక్తిశ్రద్ధలతో పూజించినట్లే బతుకమ్మను కూడా అదే విధంగా ఆరాధిస్తారు. చుట్టపక్కల మహిళలు అందరూ ఒకచోట ఈ బతుకమ్మఆట ఆడుతుండటం ఒక ప్రత్యేకతను సంతరించకుంటుంది. అందుకే తెలంగాణ వాసులు పది రోజుల పాటు జరుపుకునే ముఖ్యమైన పండగ రోజులుగా భావిస్తారు. సకాలంలో వర్షాలు కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ బతుకమ్మను వేడుకుంటారు. ఈరోజు నుంచి రంగుల పూల పండగ ప్రారంభమవుతుండటంతో తెలంగాణ అంతా రంగుల మయంగా మారనుంది.


Tags:    

Similar News