చీరాల వైసీపీలో బీఫారం చిక్కులు.. లెక్కలు తేల‌క?

చీరాల వైసీపీలో కొత్త చిక్కులు ఎదురయ్యాయి. ఇక్కడ గ‌త ఎన్నిక‌ల‌కు ముందు నుంచి ఆమంచి కృష్ణ మోహ‌న్ వైసీపీ త‌ర‌ఫున పోటీ చేశారు. 2014లో చీరాల స‌మితి [more]

Update: 2020-03-22 12:30 GMT

చీరాల వైసీపీలో కొత్త చిక్కులు ఎదురయ్యాయి. ఇక్కడ గ‌త ఎన్నిక‌ల‌కు ముందు నుంచి ఆమంచి కృష్ణ మోహ‌న్ వైసీపీ త‌ర‌ఫున పోటీ చేశారు. 2014లో చీరాల స‌మితి పార్టీ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన ఆమంచి ఆ త‌ర్వాత అప్పటి అధికార పార్టీ టీడీపీ నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు ఉండ‌డంతో టీడీపీలోకి జంప్ చేసేశారు. ఆమంచి టీడీపీలో ఉన్నా అక్కడ ఎమ్మెల్సీ పోతుల సునీత‌తో తీవ్రమైన పోరాటం చేశారు. ఇక గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ నుంచి పోటీ చేసిన ఆమంచి ఓడిపోయారు. ఆమంచి ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలోకి రావ‌డంతో అప్పటి వ‌ర‌కు వైసీపీలో ఉన్న ఎడం బాలాజీని జ‌గ‌న్ ప‌క్కన పెట్టి మ‌రీ ఆమంచికి ఛాన్స్ ఇచ్చారు. అయితే, ఆయ‌న ఓడిపోవ‌డం టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసిన క‌ర‌ణం బలరాం విజ‌యం సాధించ‌డం తెలిసిందే.

కీలక నేతలందరూ….

అయితే, ఇప్పుడు రెండు క‌త్తులు ఒకే ఒర‌లో అన్న చందంగా ఆ మంచి, క‌ర‌ణం ఇద్దరూ కూడా ఇప్పుడు వైసీపీలోనే ఉన్నారు. దీనికి తోడు ఆమంచిపై పోటీ చేసి ఓడిన ఎమ్మెల్సీ పోతుల సునీత మాత్రమే కాదు. చీరాల‌కు చెందిన మాజీ మంత్రి పాలేటి రామారావు సైతం వైసీపీలో చేరిపోయారు. ఇలా చీరాల‌కు చెందిన కీల‌క నేత‌లు అంద‌రూ ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో ప‌ర‌స్పరం ప్రత్యర్థులుగా ఉన్న ఆమంచి, క‌ర‌ణం వైసీపీలో ఉండ‌డంతో ఇరు ప‌క్షాల మ‌ధ్య విభేదాలు త‌గ్గాల్సింది పోయి.. మ‌రింత‌గా పెరుగుతున్నాయ‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు. స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో అభ్యర్థుల ఎంపిక విష‌యం అంతా పార్టీ అధిష్టానం ఆమంచికే అప్పగించింది. ఇక్కడ మొత్తం 33 స్థానాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన బీఫారాల‌న్నీ.. జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. ఆమంచి కృష్ణమోహ‌న్‌కు అప్పగించారు. దీంతో త‌న వ‌ర్గానికి పంచుకునేందుకు ఆమంచి రెడీ అయ్యారు.

కరణం చేరికతో….

అయితే, టీడీపీ ఎమ్మెల్యే క‌ర‌ణం.. దీంతో డ‌మ్మీ అయిపోయారు. ఈ ప‌రిణామాల‌తో త‌న వారిలో అసంతృప్తి పెల్లుబికింది. ఇంత‌లో ఆయ‌న పార్టీ మార్పు ప్రక‌టించారు. త‌న కుమారుడికి తీసుకువెళ్లి వైసీపీలో చేర్పించారు. దీంతో ఒక్కసారిగా నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ ర‌గ‌డ ప్రారంభ‌మైంది. త‌న‌కు కూడా బీఫారాలు కావాల‌ని ఆయ‌న ప‌ట్టుబ‌ట్టారు. అంతేకాదు, మొత్తం అంతా కూడా త‌న చేతుల మీదుగానే జ‌రుగుతుంద‌ని అన్నారు. దీంతో బాలినేని హ‌ఠాత్తుగా ఆమంచికి ఇచ్చి న బీఫారాల‌ను అక్కడి నుంచి తీసుకు వెళ్లి.. క‌ర‌ణం చేతిలో పెట్టారు. ఎందుకంటే బాలినేని స్వయంగా క‌ర‌ణంను ద‌గ్గరుండి మ‌రీ వైసీపీలో చేర్పించారు. ఈ ప‌రిణామంతో ఆమంచి ర‌గిలిపోయారు. ఇదే విష‌యంపై బాలినేనిని ప్రశ్నించారు.

మధ్యేమార్గంగా…..

దీంతో ఆయ‌న ఇరు ప‌క్షాల‌ను శాంతింప జేసేందుకు ప్రయ‌త్నించినా ఫ‌లితం ద‌క్కలేదు. దీంతో మొత్తానికి బీఫారాలు తెప్పించి త‌న ద‌గ్గరే పెట్టుకుని ఇరు వ‌ర్గాలు పంచే ఏర్పాటు చేశారు. ఆమంచి వ‌ర్గానికి 19, క‌ర‌ణం వ‌ర్గానికి 14 ఇస్తామ‌ని చెప్పారు. అయితే, ఆమంచి వ‌ర్గం 25 పైగానే త‌మ‌కు కావాల‌ని ప‌ట్టుబ‌ట్టింది. దీంతో ఇప్పుడు బీఫారాల ర‌గ‌డ రోడ్డున ప‌డిన‌ట్టయింది. ఇదే టైంలో పోతుల సునీత.. మాజీ మంత్రి పాలేటి రామారావు వ‌ర్గాలు సైతం త‌మ‌కు కూడా ఎన్నో క‌న్ని బీ ఫార‌మ్‌లు కావాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. ఇంత‌లోనే ఎన్నిక‌లు వాయిదా ప‌డడంతో ప్రస్తుతం ఈ ర‌గ‌డ ప‌క్కకు త‌ప్పుకొన్నా.. రాబోయే రోజుల్లో అయినా ఆమంచి, క‌ర‌ణంల మ‌ధ్య రాజీ కుదురుతుందా ? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

Tags:    

Similar News