America Prsidential Elections : స్వింగ్ స్టేట్స్ ఏమంటున్నాయి? భారత్ లో భారీ బెట్టింగ్ లు.. అమెరికాలో ఆసక్తికర పోరు

ఈనెల 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇంకా మూడు రోజులు మాత్రమే సమయం ఉంది

Update: 2024-11-03 05:47 GMT

ఈనెల 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇంకా మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ ఎవరన్న దానిపై భారీ స్థాయిలో బెట్టింగ్ లు జరుగుతున్నాయి. అమెరికాలోనే కాదు సుమా.. భారత్ లోనూ అమెరికా అధ్యక్ష ఎన్నికలపై జోరుగా బెట్టింగ్ లు జరుగుతున్నాయి. జ్యోతిష్యాలను కూడా పరిశీలించి మరీ బెట్టింగ్ లను కడుతున్నారట. లక్షల్లో బెట్టింగ్ లతో అనేక మంది పోటీ పడుతుండటంతో ఇప్పటికే కోట్లాది రూపాయల బెట్టింగ్ అమెరికా అధ్యక్ష ఎన్నికల విషయంలో భారత్ లో జరిగిందంటున్నారు. ఎక్కువ మంది తిరిగి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలను చేపడతారని బెట్టింగ్ కడుతుండగా, కొద్ది మంది మాత్రమే కమలా హారిస్ పై బెట్టింగ్ కాస్తున్నారు.

ఎన్నిక జరిగినా...?
అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబరు 5వ తేదీన జరగనున్నాయి. అయితే అధ్యక్షుడు మాత్రం జనవరిలో ప్రమాణ స్వీకారం చేస్తారు. అమెరికాలో పోలింగ్ అనేది నవంబర్ నెలలో తొలి మంగళవారం జరగడం సంప్రదాయంగా వస్తుంది. దేశ వ్యాప్తంగా ఒకే రోజు పోలింగ్ ను నిర్వహిస్తారు. మంగళవారమే ఓటింగ్ పెట్టడానికి కూడా బలమైన కారణం ఉంది. ఆదివారం లాంటి రోజు పోలింగ్ పెడితే ప్రార్థనలకే పరిమితమవుతారని, ఓటింగ్ పట్ల ఆసక్తి చూపరని భావించి మంగళవారాన్ని ఎంచుకున్నారు. అందుకే ఏరికోరి మంగళవారాన్ని ఎంపిక చేశారు. నవంబరు నెలలో తొలి సోమవారం తరువాత రోజైన మంగళవారమే పోలింగ్ జరుగుతుంది.
స్వల్ప తేడాతోనే...
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ల అభ్యర్థిగా కమలాహారిస్ బరిలో ఉన్నారు. సర్వేల్లో స్వల్ప తేడా మాత్రమే ఉంది.ఇప్పటికే ఆరు కోట్లకు మందికి పైగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్వింగ్ స్టేట్స్ గా ముద్రపడే ఏడు రాష్ఠ్రాలు అమెరికా అధ్యక్షుడు ఎవరో తేలుస్తాయి. స్వింగ్ స్టేట్స్ గా అరిజోనా, జార్జియా, మిచిగాన్, నెవాడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ ఉన్నాయి. ఇక్కడ భారతీయులుకూడా అధికంగానే ఉన్నారు. ఇక్కడ ఎవరు అత్యధిక ఓట్లు సాధిస్తే వారిదే గెలుపు. ఇద్దరి మధ్య ఓట్ల తేడా స్వల్పంగా ఉండటంతో పోటీ ఆసక్తికరంగా మారింది. కేవలం ఇద్దరి మధ్య తేడా వివిధ సర్వేల్లో ఒక తేడా మాత్రమే ఉండటంతో ఎవరిది గెలుపు అన్నది చివరి వరకూ నిర్ణయించడం కష్టమే.
భారతీయుల్లో ఆసక్తి...
అమెరికా అధ్యక్ష ఎన్నికలపై యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అందులో భారతీయులు అధికంగా ఉండటం విశేషం. ఎందుకంటే ఎక్కువ మంది భారతీయులు అక్కడ స్థిర నివాసం ఉండటమే ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. కొన్ని విషయాల్లో ట్రంప్ ఆధిక్యతలో ఉండగా, మరికొన్ని అంశాల్లో కమలా హారిస్ వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకే భారత్ లోనూ బెట్టింగ్ లు అధికంగా జరుగుతున్నాయని చెబుతున్నారు. ఎవరు గెలిస్తే భారత్ కు లాభమో అంచనా వేసుకుని మరీ ఈ ఎన్నికల్లో భారతీయ ఓటర్లు అటు వైపు మొగ్గు చూపే అవకాశమున్నందున చివరి వరకూ గెలుపు ఎవరన్నది తేల్చడం కష్టంగానే ఉందన్నది అనేక విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి.


Tags:    

Similar News