తమిళనాడు నాడి చిక్కడం లేదా?
నిజమే … తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఎవరిది గెలుపు అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. ప్రధాన సర్వేలన్నీ డీఎంకే కు సానుకూలంగా కన్పిస్తున్నప్పటికీ అండర్ కరెంట్ [more]
నిజమే … తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఎవరిది గెలుపు అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. ప్రధాన సర్వేలన్నీ డీఎంకే కు సానుకూలంగా కన్పిస్తున్నప్పటికీ అండర్ కరెంట్ [more]
నిజమే … తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఎవరిది గెలుపు అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. ప్రధాన సర్వేలన్నీ డీఎంకే కు సానుకూలంగా కన్పిస్తున్నప్పటికీ అండర్ కరెంట్ గా పళనిస్వామి దూసుకుపోతున్నారన్న వాదన కూడా బలంగా విన్పిస్తుంది. గతంలో కంటే భిన్నంగా తమిళనాడు ఎన్నికలు జరుగుతున్నాయి. గతంలో తమిళనాడులో ఎవరు గెలిచారన్న దానిపై ఒక స్పష్టత ఉండేది. కానీ నేడు అది కొరవడిందంటున్నారు.
పూర్తిగా ఒకవైపు….
తమిళనాడులో ప్రజలు పూర్తిగా ఒకవైపు మొగ్గు చూపడం లేదు. ఇది విశ్లేషకులను సయితం ఆశ్చర్య పరుస్తుంది. అంతా అనుకుంటున్నట్లు స్టాలిన్ కు ఒన్ సైడ్ మాత్రం లేదు. ఈసారి భిన్నమైన వాతావరణం తమిళనాడులో కన్పిస్తుంది. స్టాలిన్ నాయకత్వం పట్ల ప్రజలకు పెద్దగా విశ్వాసం లేకపోవడం ఒక ప్రధాన కారణంగా కన్పిస్తుంది. స్టాలిన్ ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి పదవి చేపట్టక పోవడం తన దక్షతను నిరూపించుకోలేదు.
పళని పట్ల కూడా….
ఇక పళనిస్వామి తమిళనాడులో నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా తన పాలనను సక్రమంగానే చేశారు. ఆయన పనితీరు పట్ల ప్రజలు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. బీజేపీతో జట్టుకట్టడం మినహా అన్నాడీఎంకేకు పెద్దగా మైనస్ లు ఏవీ కన్పించడం లేదు. తన పని తాను చేసుకుపోతూ కరోనా సమయంలోనూ తమిళనాడులో పళనిస్వామి వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అందుకే తంబీలు ఎక్కువగా పళనిస్వామి అంటే ఇష్టపడుతున్నారు.
నో సింపతీ…..
ఈసారి మరో విశేషమేంటంటే.. తమిళనాడులో సానుభూతి కూడా లేకపోవడం. రెండు పార్టీల అగ్రనేతలు మరణించడంతో సానుభూతి ఈసారి ఎవరికీ పనిచేయదన్నది విశ్లేషకుల అంచనా. డీఎంకే అధినేత కరుణానిధి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణించి నాలుగేళ్లు గడుస్తుండటమూ ఇందుకు కారణంగా చెబుతున్నారు. మొత్తం మీద తమిళనాడు ఎన్నికల్లో ఈసారి భిన్నమైన తీర్పు వచ్చే అవకాశముందన్నది విశ్లేషకుల అంచనా.