“అప్పు” తీసుకోవడానికే? సాయం ఏమీ లేదే?

ప్రస్తుతం క‌రోనా స‌మ‌యంలో విధించిన దేశ‌వ్యాప్త లాక్‌డౌన్ కార‌ణంగా.. రాష్ట్రాలు భారీ స్థాయిలో ఆదాయం కోల్పోయాయి. నిజానికి ఆర్టీసీ వంటి ప్రజార‌వాణా వ్యవ‌స్థలు ఏదైనా కార‌ణంతో ఒక్కరోజు [more]

Update: 2020-04-24 17:30 GMT

ప్రస్తుతం క‌రోనా స‌మ‌యంలో విధించిన దేశ‌వ్యాప్త లాక్‌డౌన్ కార‌ణంగా.. రాష్ట్రాలు భారీ స్థాయిలో ఆదాయం కోల్పోయాయి. నిజానికి ఆర్టీసీ వంటి ప్రజార‌వాణా వ్యవ‌స్థలు ఏదైనా కార‌ణంతో ఒక్కరోజు ఆగితేనే వంద‌ల కోట్లలో న‌ష్టం వ‌చ్చింద‌ని పెద్ద ఎత్తున ప్రభుత్వాలు ఆవేద‌న వ్యక్తం చేస్తాయి. అలాంటిది ఇప్ప ‌టికి దాదాపు నెల రోజులుగా అన్నీ ఆగిపోయాయి. ఒక్క ఏపీ అనేకాదు.. దేశ‌వ్యాప్తంగా క‌రోనా ఎఫెక్ట్ ఉన్న రాష్ట్రాలు, లేని రాష్ట్రాల్లోనూ కూడా లాక్‌డౌన్ ప‌టిష్టంగా అమ‌లు జ‌రుగుతోంది. దీంతో ప్రజ‌లు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. ఇదే స‌మ‌యంలో ప‌నులు నిలిచిపోయాయి.

ఆదాయం తగ్గి.. ఖర్చులు…..

ప‌రిశ్రమ‌లు, కంపెనీలు కూడా ఆగిపోయాయి. అటు ప్ర‌జ‌ల‌కు,ఇటు ప్రభుత్వానికి కూడా ఆదాయం లేకుండా పోయింది. ప్రజ‌ల మాట ప‌క్కన పెడితే ప్రభుత్వాల‌కు ఆదాయం త‌గ్గడంతోపాటు.. అదే స‌మ‌యంలో ఖ‌ర్చు భారీ ఎత్తున పెరిగింది. క‌రోనా ఎఫెక్ట్‌తో ముందు జాగ్రత్త చ‌ర్యలు తీసుకోవాల్సి రావ‌డం, అదే స‌మయంలో పేద‌ల‌కు బియ్యం స‌హా నిత్యావ‌స‌రాలు అందించ‌డం, వైద్య సేవ‌లు మ‌రింత వేగం చేయడం.. వైద్య పని ముట్లు ఏర్పాటు చేసుకోవ‌డం, క‌రోనా టెస్టులు ఇలా అనేక రూపాల్లో ఖ‌ర్చు భారీ ఎత్తున పెరిగి పోయింది. దీంతో ఆదాయం త‌గ్గి ఖ‌ర్చు పెరిగిపోవ‌డంతో ప్రభుత్వాలు నిధుల కోసం కేంద్రంపై ఆధారప‌డ్డాయి.

ఆర్బీఐ ప్రకటించినా…..

అయితే, క‌రోనా ఎఫెక్ట్‌తో తాము ల‌క్షా డెబ్బయి వేల కోట్ల ప్యాకేజీ ప్రక‌టించామ‌ని ఇప్పటికే ప్రక‌టించుకు న్న కేంద్ర ప్రభుత్వం ఇక‌పై క‌ష్టాన్ని రాష్ట్రాల‌కే వ‌దిలేసింది. ఈ నేప‌థ్యంలోనే గ‌తంలో రాష్ట్రాలు అడిగినా.. స్పందించ‌ని ఆర్బీఐ. అనూహ్యమైన ప్యాకేజీ ప్రక‌టించింది. కరోనా కష్టకాలంలో రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు వేస్‌ అండ్‌ మీన్స్‌ రుణాల (డబ్ల్యూఎంఏ) పరిమితిని 60 శాతానికి పెంచుతున్నట్లు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధం (సెప్టెంబరు 30) వరకు ఈ పెంపు అందుబాటులో ఉంటుంది.

వెసులు బాటు మాత్రమే…..

అంటే..రాష్ట్రాలు అప్పులు చేసుకునేందుకు రుణ పరిమితిని 30 శాతం పెంచారు. ఆర్బీఐ నిర్వహించే తాత్కాలిక ద్రవ్య సర్దుబాటు నిధినే డబ్ల్యూఎంఏగా వ్యవహరిస్తారు. ప్రభుత్వాలు ద్రవ్య కొరతను తీర్చుకు నేందుకు ఈ నిధి నుంచి గరిష్ఠంగా 90 రోజుల కోసం రుణం తీసుకునే వీలుంటుంది. లాక్‌డౌన్‌తో రాష్ట్రాలకు ఆదాయ మార్గాలు పూర్తిగా మూసుకుపోయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలకు నిధుల కొరత తీరడానికి డబ్ల్యూఎం కు వెసులు బాటు క‌ల్పించారు.

అప్పులు మాత్రమేనట…

.
అంటే.. కేంద్రం నిధులు ఇవ్వకుండా రాష్ట్రాల‌ను అప్పులు చేసుకునేందుకు ప‌రోక్షంగా ప్రోత్సహించిన‌ట్టుగా ఉంద‌నేది ఆర్ధిక నిపుణుల మాట‌. నిజానికి ఇప్పటికే ఏపీ,తెలంగాణ,త‌మిళ‌నాడు వంటి రాష్ట్రాలు భారీ ఎత్తున అప్పులు చేశాయి. ఇప్పుడు క‌రోనా కార‌ణంగా ఆదాయం త‌గ్గి తిప్పలు ప‌డుతున్నాయి. ఈ స‌మ‌యంలో కేంద్రం నిధులు ఇవ్వాల‌ని వాటిని కూడా గ్రాంటు రూపంలో ఇవ్వాల‌ని కోరుతున్నాయి. ఈ స‌మ‌యంలో ఆర్బీఐ ఇలా అప్పు తీసుకోండి 90 రోజుల్లో తిరిగి చెల్లించండి అని చెప్పడం వెనుక కేంద్రం రాష్ట్రాల‌కు చిప్ప చేతిలో పెట్టిన‌ట్టుగానే ఉంద‌ని అంటున్నారు నిపుణులు.

Tags:    

Similar News