గవర్నర్ నిర్ణయం… ఆయనే సీఎం

మధ్యప్రదేశ్ రాజకీయాలపై కరోనా ఎఫెక్ట్ పడింది. ముఖ్యమంత్రి పదవికి కమల్ నాధ్ ఇప్పటికే రాజీనామా చేశారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో ప్రభుత్వం అధికారికంగా లేనట్లే. అయితే బలం [more]

Update: 2020-03-23 18:29 GMT

మధ్యప్రదేశ్ రాజకీయాలపై కరోనా ఎఫెక్ట్ పడింది. ముఖ్యమంత్రి పదవికి కమల్ నాధ్ ఇప్పటికే రాజీనామా చేశారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో ప్రభుత్వం అధికారికంగా లేనట్లే. అయితే బలం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ బలపరీక్షకు ముందుగానే చేతులెత్తేయడంతో ఇక తదుపరి ప్రభుత్వ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతుంది. అయితే కరోనా ఎఫెక్డ్ పడటంతో కొద్దిగా సందిగ్దం నెలకొని ఉంది.

కమల్ నాథ్ రాజీనామాతో….

మధ్యప్రదేశ్ లో బలాన్ని నిరూపించుకోవాలని కమల్ నాధ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఆయన రాజీనామా చేశారు. అయితే బీజేపీ తమకు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని అప్పటికే గవర్నర్ లాల్జీ టాండన్ ను బీజేపీ కోరింది. ఈలోపు కరోనా వైరస్ ప్రబలడంతో గవర్నర్ సయితం దానిపై దృష్టి పెట్టారు. మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని లాక్ డౌన్ చేసేశారు. నిజానికి ఆది, సోమవారాల్లో బీజేపీ నేతలు గవర్నర్ ను కలిసి తమ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరారు.

పెద్ద పార్టీగా బీజేపీ….

మధ్యప్రదేశ్ లో 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం పొందాయి. తొలుత ఆరుగురు మంత్రుల రాజీనామాలను ఆమోదించిన స్పీకర్ తర్వాత బలపరీక్ష రోజున మిగిలిన 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ బలాన్ని కోల్పోయింది. బీజేపీ 107 మంది సభ్యులతో అతి పెద్ద పార్టీగానూ, మెజారిటీతోనూ ఉంది. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అన్నీ సిద్ధమయిన తరుణంలో కరోనా షాక్ తగిలింది.

ప్రభుత్వ ఏర్పాటుపై…

అయితే ప్రస్తుతం కరోనా వ్యాప్తి చెందుతుండటంతో ప్రభుత్వాన్ని వెంటనే ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా ఊపందుకుంది. అధికారులు సమర్థవంతంగా పనిచేయాలంటే ప్రభుత్వం ఉండాలని అంటున్నారు. దీనిపై గవర్నర్ లాల్జీ టాండన్ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణస్వీకారం చేశారు. దీంతో మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమయింది.

Tags:    

Similar News