ఇద్దరూ సీతయ్యలేగా

అందరూ సీతయ్యలే….అధికారంలోకి వస్తే ఎవరి మాట వినరు. వారు అనుకున్నట్లే చేస్తారు. ఇందుకు చంద్రబాబునాయుడు, జగన్ లు మినహాయింపు కాదు. సాధారణంగా అధికారంలో ఉంటే తాము అనుకున్న [more]

Update: 2019-07-27 11:00 GMT

అందరూ సీతయ్యలే….అధికారంలోకి వస్తే ఎవరి మాట వినరు. వారు అనుకున్నట్లే చేస్తారు. ఇందుకు చంద్రబాబునాయుడు, జగన్ లు మినహాయింపు కాదు. సాధారణంగా అధికారంలో ఉంటే తాము అనుకున్న పనులను అనుకున్న రీతిలోనే చేయాలనుకుంటారు. అది సహజనైజం. కానీ ఇక్కడ ప్రతిపక్ష నేత చెప్పినట్లు జరగకుంటే శాసనసభ సమావేశాల్లో గొడవలు ప్రారంభమవుతాయి. తెలుగుదేశం అధికారంలో ఉన్నా, వైఎస్సార్ కాంగ్రెస్ పవర్ లో ఉన్న ముఖ్యమంత్రులందరిదీ ఒకేతీరు.

నిత్యం మీడియా సమావేశాల్లో….

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రతిరోజూ అసెంబ్లీ సమావేశాలు పూర్తికాగానే ఒక మీడియా సమావేశం పెడుతున్నారు. ఇందులో జగన్ పాతకాలం వీడియోలను ప్రదర్శిస్తున్నారు. రెండు రోజుల క్రితం జగన్ గురించి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏమన్నారో ప్రొఫెసర్ హరగోపాల్ తో ఒక యూట్యూబ్ ఛానల్ చేసిన ఇంటర్వ్యూను ప్రదర్శించారు. 1970లో జగన్ గురించి వైఎస్ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు ప్రదర్శించారు. ఇక మళ్లీ గోదావరి జలాలపై జగన్ ఎన్ని టర్న్ లు తీసుకున్నారన్న విషయంపై చంద్రబాబు మరో వీడియోను ప్రదర్శించారు.

జగన్ సీఎంగా ఉంటే….

ఇలా ప్రతిరోజూ చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ గురించి మీడియా సమావేశం పెట్టి మరీ ఈ రాష్ట్రం ఎట్టిపరిస్థితుల్లో అభివృద్ధి చెందే అవకాశం లేదని చెబుతున్నారు. పోలవరం, అమరావతి, విద్యుత్తు పీపీఏలపై జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను చంద్రబాబు రోజూ ఎండగడుతున్నారు. తాము తీసుకున్న నిర్ణయాలనే కొనసాగించాలన్నది చంద్రబాబు నాయుడి కోరిక. కానీ జగన్ మాత్రం అందుకు విరుద్ధంగా అన్ని విషయాలపై కమిటీలు వేసి నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు.

బాబు హయాంలో….

చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా అసెంబ్లీ సమావేశాలు ఏరకంగా జరగాయో చూశాం. అప్పటి స్పీకర్ వ్యవహరించిన తీరునూ ప్రత్కక్ష ప్రసారంలోనే వీక్షించాం. అప్పటికీ ఇప్పటికీ పెద్దగా తేడా లేకపోయినా చంద్రబాబు నాయుడు నీతి, నిజాయితీ, విలువలు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుండటాన్ని ప్రజలు కూడా లైట్ గానే తీసుకుంటున్నట్లున్నారు. ఇలా ఎవరు అధికారంలో ఉంటే వారి ఇష్టప్రకారం పాలన నడుస్తుంది. ఓడిపోయినా తన మాటే చెల్లాలంటున్న చంద్రబాబు ఇక ఐదేళ్లు ఉద్యమాల్లోనూ, మీడియా సమావేశాల్లోనూ గడపక తప్పదు.

Tags:    

Similar News