ఆ వైసీపీ ఎమ్మెల్యే పనిపడుతున్న దెవరు?

వైసీపీ ఎమ్మెల్యే బాధ అంతా ఇంతా కాదు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నా… అధికారంలో ఉన్నా సేమ్ టు సేమ్. ఆయనకు ఎప్పుడూ అధికారులు మాట వినలేదు. అధికారంలో [more]

Update: 2019-11-11 13:30 GMT

వైసీపీ ఎమ్మెల్యే బాధ అంతా ఇంతా కాదు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నా… అధికారంలో ఉన్నా సేమ్ టు సేమ్. ఆయనకు ఎప్పుడూ అధికారులు మాట వినలేదు. అధికారంలో ఉన్నా మాట వినకపోవడానికి కారణమేంటంటే ఎమ్మెల్యే కంటే అధికారులే అక్కడ బలంగా ఉండటమని చెప్పాలి. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే. అయినా సరే ఆయనను అధికారులు మాత్రం ప్రతిపక్ష ఎమ్మెల్యేగానే చూస్తున్నారట. ఆయన ఎంత ఆవేదన చెందినా అధికారుల తీరు మారలేదంటున్నారు.

అధికారులు లెక్క చేయక….

గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి ముస్తాఫా 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచారు. అయితే అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ముస్తాఫా నామమాత్రపు ఎమ్మెల్యేగానే మిగిలిపాయారు. తన నియోజకవర్గంలో పనులు చేయించుకునేందుకు ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం కన్పించలేదు. తూర్పు నియోజకవర్గంలో కల్తీ నీరు సరఫరా అయి ప్రజలు డయోరియా బాధిన పడినా అధికారులు కరుణించలేదు. చివరకు ముస్తాఫా దీనిపై పోరాటం చేయాల్సి వచ్చింది. తన సొంత డబ్బుతో నియోజకవర్గంలో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాల్సి వచ్చింది. అప్పుడు ఈ నియోజకవర్గంలోనూ టీడీపీ నేతలే ఆధిపత్యం చెలాయించేవారు.

టీడీపీ నేతలదే హవా….

ముస్తాఫాను టీడీపీలోకి రమ్మని నేతలు ఎంత ప్రయత్నించినా వెళ్లలేదు. వ్యాపారాలను దెబ్బతీసినా చలించలేదు. తన గురువు రాయపాటి సాంబశివరావు స్వయంగా చంద్రబాబు వద్దకు తీసుకెళ్లినా ముస్తాఫా నియోజకవర్గ సమన్యలను గురించి ప్రస్తావించారే తప్ప పార్టీలో చేరలేదు. జగన్ ను నమ్ముకుని ఉన్నారు. వైసీపీలోనే కొనసాగిన ముస్తాఫా ఇటీవల జరిగిన ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి మరోసారి గెలిచారు. ఇప్పుడు ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే. ఇది బయటకు కన్పించే నిజం. కానీ ఆయనను అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు.

మళ్లీ ఆ అధికారులే….

గతంలో కార్పొరేషన్ లో పనిచేసిన అధికారులే ఇప్పుడూ చక్రం తిప్పుతున్నారు. వారు బదిలీ కాకుండా కొందరు మంత్రులను పట్టుకుని అదే పదవిలో కొనసాగుతున్నారు. ముస్తాఫాను లైట్ గా తీసుకున్నారు. దీంతో ముస్తాఫా మండిపడుతున్నారు. తనను అధికారుల వేధిస్తున్న తీరును జడ్పీ సమావేశంలోనే వెళ్లగక్కారు. తాను చివరకు మంత్రులతో చెప్పించుకోవాల్సి వస్తుందని ముస్తాఫా ఆవేదన చెందారు. అధికారులు మంత్రులను పట్టుకుని ఇక్కడే సెటిలయి ముస్తాఫాను పట్టించుకోవకపోవడంపై వైసీపీలోనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఈ విషయం జగన్ దృష్టికి వెళ్లడంతో ఇన్ ఛార్జి మంత్రిని ఈ విషయంపై ఆరా తీసినట్లు తెలిసింది.

Tags:    

Similar News