ముస్తాఫాకు మహర్దశ పట్టిందిగా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తన మంత్రి వర్గాన్ని విస్తరించనున్నారు. మంత్రి వర్గ విస్తరణలో అనేక మార్పులుంటాయంటున్నారు. ఎన్నికల కేబినెట్ కోసం జగన్ ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించారు. [more]

Update: 2021-07-08 06:30 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తన మంత్రి వర్గాన్ని విస్తరించనున్నారు. మంత్రి వర్గ విస్తరణలో అనేక మార్పులుంటాయంటున్నారు. ఎన్నికల కేబినెట్ కోసం జగన్ ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించారు. సామాజికంగా, రాజకీయంగా, విధేయత, హామీ వంటి అంశాలను కేబినెట్ విస్తరణలో జగన్ పరిగణనలోకి తీసుకుంటున్నారని చెబుతున్నారు. అయితే ఇందులో ప్రముఖంగా ఈసారి విన్నపిస్తున్న పేరు ముస్తాఫా.

ఈసారి విస్తరణలో…..

ఈసారి కేబినెట్ విస్తరణలో ముస్తాఫాకు ఖచ్చితంగా మంత్రిపదవి దక్కుతుందన్న ప్రచారం జరుగుతుంది. ఆయనకు మైనారిటీ కోటాలో మంత్రి పదవి ఖాయమయిందని చెబుతున్నారు. మైనారిటీలకు తన పాలనలో పెద్దపీట వేస్తున్న జగన్ ఈసారి ముస్తాఫాకు తన కేబినెట్ లో చోటు కల్పిస్తారంటున్నారు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. ముస్తాఫా పార్టీని, జగన్ ను నమ్ముకుని ఉండటమే.

విధేయతే….?

ముస్తాఫా గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో వైసీపీ నుంచి తొలిసారి గెలిచినప్పుడు ముస్తాఫా పై పార్టీ మారాలని వత్తిడి వచ్చింది. తన గురువు రాయపాటి సాంబశివరావు కూడా టీడీపీలో చేరాలని వత్తిడి తెచ్చారు. అయినా ముస్తాఫా జగన్ వెంటే ఉంటానని చెప్పారు. ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆర్థికంగా, రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముస్తాఫా మాత్రం పార్టీని వీడలేదు.

సీనియర్ కూడా….

ముస్తాఫాకు తొలి విడతలోనే కేబినెట్ లో చోటు దక్కాల్సి ఉంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కడప జిల్లాకు చెందిన అంజాద్ భాషాకు ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు వైసీపీలో ఉన్న వారిలో మైనారిటీలో ముస్తాఫాయే సీనియర్. ఇక్బాల్ వంటి వారు ఉన్నా వారు ఎమ్మెల్సీలుగా ఉన్నారు. ఇక గుంటూరు జిల్లాలో రాజకీయ సమీకరణాలు చూసుకున్నా ముస్తాఫాకు ఈసారి మంత్రివర్గంలో చోటుదక్కుతుందని చెబుతున్నారు. మొత్తం మీద ముస్తాఫా కు మహర్దశ పట్టినట్లే.

Tags:    

Similar News