Nallpureddy : ప్రసన్నకు ఆ భయం పట్టుకుందా?
నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సీనియర్ నేత. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చారు. బాగానే రాణించారు. అయితే ఆయన ఇటీవల కాలంలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. [more]
నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సీనియర్ నేత. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చారు. బాగానే రాణించారు. అయితే ఆయన ఇటీవల కాలంలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. [more]
నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సీనియర్ నేత. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చారు. బాగానే రాణించారు. అయితే ఆయన ఇటీవల కాలంలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. సొంత పార్టీనేతలపై ఆయన కారాలు మిరియాలు నూరుతున్నారు. మరోసారి సెంటిమెంట్ కోవూరు నియోజకవర్గంలో పనిచేస్తే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి విజయం దక్కే అవకాశం లేదు. అందుకే ఆయనలో అంత ఆందోళన కన్పిస్తుంది.
నాలుగు సార్లు గెలిచి….
నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నాలుగు సార్లు పనిచేశారు. ఒకసారి ఉప ఎన్నికలలో గెలిచారు. అయితే కోవూరు నియోజకవర్గంలో ఒక సెంటిమెంట్ ఉంది. ఒకసారి గెలిస్తే మరోసారి గెలిచే అవకాశాలు లేవు. 1994 1999 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసి వరసగా రెండుసార్లు గెలిచింది నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాత్రమే. దాదాపు రెండు దశాబ్దాల నుంచి అది జరగలేదు.
మార్చి.. మార్చి….
2004 లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గెలిచారు. 2009లో టీడీపీ తరుపున నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గెలిచారు. 2014లో జగన్ పార్టీ నుంచి పోటీ చేసిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అప్పుడు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి గెలిచారు. 2019 ఎన్నికల్లో మళ్లీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విజయం సాధించారు. ఒకసారి గెలిస్తే మరోసారి ఇక్కడ ప్రజలు గెలిపించరన్న సెంటిమెంట్ బలంగా పాతుకుపోయింది.
సొంత ప్రాంతంలోనూ…..
దీనికి తోడు నియోజకకవర్గంలో పార్టీ నేతలు కూడా తనకు సహకరించడం లేదన్న ఆందోళనలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నారు. పరిషత్ ఎన్నికల్లో ఆయన సొంత ప్రాంతంలో ఎంపీటీసీ స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది. ఇది ఆయనను మానసికంగా ఇబ్బంది పెడుతుంది. కోట పంచాయతీ పరిస్థితి కూడా అంతే. కోవూరు నియోజకవర్గంలో మరోసారి సెంటిమెంట్ పనిచేస్తే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి పరాజయం తప్పదని, ఇందుకు పరిషత్ ఎన్నికలే నిదర్శమన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.