ఆర్టీసీ ‘ముందు’ జాగ్రత్త

ఆర్టీసీలో కార్మికులు ఈ నెల 5 నుంచి సమ్మెకు పిలుపునివ్వడంతో అధికారులు సమాలోచనలో పడ్డారు. ఓ వైపు జేఏసీ నేతలతో రెండోసారి చర్చలు జరుపుతూనే మరోవైపు కార్మికులు [more]

Update: 2019-10-03 10:24 GMT

ఆర్టీసీలో కార్మికులు ఈ నెల 5 నుంచి సమ్మెకు పిలుపునివ్వడంతో అధికారులు సమాలోచనలో పడ్డారు. ఓ వైపు జేఏసీ నేతలతో రెండోసారి చర్చలు జరుపుతూనే మరోవైపు కార్మికులు సమ్మెకు దిగితే ఏం చేయాలనే విషయంలో ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.

సమ్మె యథాతధం….

ప్రభుత్వం నియమించిన ముగ్గురు ఐఏఎస్ అధికారుల కమిటీ బుధవారం ఆర్టీసీ కార్మిక నేతలతో చర్చలు జరిపింది. కార్మిక నేతలు వారి సమస్యలన్నింటిని కమిటీ ముందు ఏకరువు పెట్టారు. కాని కమిటీ మాత్రం జేఏసీ నేతలకు ఎటువంటి హామీ ఇవ్వలేదు. దీంతో చర్చల అనంతరం జేఏసీ నేతలు తమకు ఎలాంటి హామీ రాలేనందున సమ్మె యథాతధంగా కొనసాగుతుందని ప్రకటించింది.

నాగరాజు కమిటీ ఏమైంది….?

జేఏసీ నేతలు మాత్రం తమకు కమిటీలతో ఎలాంటి ఫలితాలు లేవని చెబుతున్నారు. గత ఏడాదిజూన్ లోనే నాగరాజు కమిటీని ప్రభుత్వం వేసిందని, ఆ కమిటీ ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చిందని చెబుతున్నారు. మూడు నెలల్లో సమస్యలకు పరిష్కారం చూపాలని కమిటీ నివేదికలో తెలిపిందన్నారు. మరి ఇప్పటికి 15 నెలలు గడిచినా మా గోడు పట్టించుకోవడం లేదని జేఏసీ నేతలు సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మరో కమిటీని ప్రభుత్వం వేసిందని ఈ కమిటీ పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుందని వారు మండిపడుతున్నారు.

సహాకరించండి….

ఆర్టీసీ కార్మికుల సమస్యలను తెలుసుకున్నామని ఈ సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని సోమేష్ కుమార్ ప్రకటించారు. మళ్లీ మరోసారి చర్చలు జరుపుతామన్నారు. దసరా పండగ దృష్ట్యా కార్మికులు సమ్మెను విరమించుకోవాలని విన్నవించారు. సమస్యలపై పరిష్కారం దిశగా అడుగులేస్తున్నామని కమిటీ తెలిపింది.

అవుట్ సోర్సింగ్ పద్దతిలో…..

ఆర్టీసీ అధికారులు మాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి ఆలోచిస్తున్నారు. అవుట్ సోర్సింగ్ పద్దతిలో కొంత మందిని తీసుకుని సమ్మె సమయంలో వారితో బస్సులు నడిపించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మరోవైపు ప్రయాణికులు సైతం ముందుగానే తమ గ్రామాలకు వెళ్లిపోతున్నారు. దీంతో బస్ స్టేషన్లు, రైల్వేస్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి.

 

 

Tags:    

Similar News