పండుల చేసిన తప్పు అదేనా?
రాజకీయాల్లో ఉన్నవారికి పరిస్థితులు అనుకూలిస్తే సరే.. లేదంటే మాత్రం ఫ్యూచర్ కూడా గల్లంతైన పరి స్థితులు చాలానే ఉన్నాయి. చాలా మంది నేటికీ ఫ్యూచర్ లేని పరిస్థితిని [more]
రాజకీయాల్లో ఉన్నవారికి పరిస్థితులు అనుకూలిస్తే సరే.. లేదంటే మాత్రం ఫ్యూచర్ కూడా గల్లంతైన పరి స్థితులు చాలానే ఉన్నాయి. చాలా మంది నేటికీ ఫ్యూచర్ లేని పరిస్థితిని [more]
రాజకీయాల్లో ఉన్నవారికి పరిస్థితులు అనుకూలిస్తే సరే.. లేదంటే మాత్రం ఫ్యూచర్ కూడా గల్లంతైన పరి స్థితులు చాలానే ఉన్నాయి. చాలా మంది నేటికీ ఫ్యూచర్ లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారిలో తాజాగా ఈ జాబితాలోకి చేరిపోయారు మాజీ ఎంపీ, మాజీ టీడీపీ నేత పండుల రవీంద్రబాబు. పశ్చి మ గోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వలి గ్రామానికి చెందిన పండుల రవీంద్రబాబు ఐఆర్ఎస్ అధికారి. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఉన్నత విద్యా వంతుడు. ఏ విషయంపైనైనా పూర్తి అవగాహనతో మాట్లా డగలిగిన నాయకుడిగా పండుల రవీంద్రబాబు పేరు తెచ్చుకున్నారు.
ఎన్నికలకు ముందు….
ప్రస్తుతం బీజేపీ నేత, ఎంపీ సుజనాచౌదరి పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన పండుల రవీంద్రబాబు 2014కు ముందు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి వరకు ఐఆర్ఎస్ అధికారిగా ఉన్న ఆయనకు వచ్చి రావడంతోనే టీడీపీ లోక్‌సభ సీటు దక్కింది. ఈ క్రమంలోనే తూర్పగోదావరి జిల్లా అమలాపురం పార్లమెంటు నుంచి అదే ఏడాది వచ్చిన ఎన్నికల్లో పండుల రవీంద్రబాబు పోటీ చేసి విజయం సాధించారు. పార్టీ పట్ల విధేయత, వినయంతో పా టు వివాదాలకు దూరంగా ఉంటూ.. తనదైన శైలిలో రాజకీయాలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రంతో పండుల రవీంద్రబాబు గట్టిగానే పోరాడిన టీడీపీ ఎంపీల్లో ఒకరిగా గుర్తింపు సాధించారు. అయితే, ఈ ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు.. తనకు టీడీపీ సీటు ఇచ్చే అవకాశం లేదని తెలియడంతో పండుల రవీంద్రబాబు తన వ్యూహాన్ని మార్చుకున్నారు.
ఎంపీ పదవికి రాజీనామా చేసి….
అమలాపురం టికెట్‌ను మాజీ స్పీకర్ గంటి మోహనచంద్ర బాలయోగి కుమారుడికి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు ఎన్నికలకు నెల రోజుల ముందే ప్రచారంలోకి వచ్చింది. దీంతో పండుల రవీంద్రబాబు తన దారి తాను చూసుకోవాలని నిర్ణయించుకుని ఆదిశగానే అడుగులు వేశారు.ఈ క్రమంలోనే ఆయనకు వైసీపీ నుంచి ఆహ్వానం అందడంతో ఎంపీ పదవికి, టీడీపీకి కూడా రాజీనామా చేసి వైసీపీలోకి చేరిపోయారు. అయితే, ఆ సమయంలోనే ఆయన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. కులాలను అడ్డు పెట్టుకుని మీడియాలో ప్రచారం తెచ్చుకున్నారని, రాసుకున్న స్క్రిప్టు చదవి పార్లమెంటులో మాట్లాడారని అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి.
అనుకూల మీడియాలో…
ఇదిలావుంటే, టీడీపీ అనుకూల మీడియా కూడా ఇదే సమయంలో పండుల రవీంద్రబాబును టార్గెట్ చేసింది. ఆయన వైసీపీలోకి వెళ్లినా(కేవలం వారం రోజులు కూడా గడవక ముందే) అక్కడ ఇమడలేక పోతున్నారని, ఆయన మళ్లీ టీడీపీ నేతలతో “అన్నా నేను మళ్లీ వచ్చేస్తా“ అంటూ ఫోన్లు చేస్తున్నారని వరుస కథనాలు ప్రచారం చేసింది. దీంతో ఇటు వైసీపీ అధినేత జగన్‌కు కూడా మానసికంగా పండుల రవీంద్రబాబు దూరమయ్యారు. దీంతో ఆయన ఆశించిన మేరకు అటు ఎమ్మెల్యే కానీ, ఇటు ఎంపీ టికెట్ కానీ ఇటు టీడీపీలోను, అటు వైసీపీలోనూ దక్కలేదు.
తీసుకున్న నిర్ణయాలే….
పోనీ.. ఏదైనా ఎమ్మెల్సీ కానీ, రాజ్యసభ సీటు కానీ ఇస్తారా? అంటే వైసీపీ లో ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. పైగా ఈ కోటాలో సీట్ల కోసం నాయకులు క్యూకట్టారు. టీడీపీలో ఉండగా ఏదో ఒకటి మాట్లాడుతూ.. రాజకీయంగా హల్‌చల్ చేసిన పండుల రవీంద్రబాబు మీడియా చర్చల్లోనూ తన వాయిస్‌ను వినిపించేవారు. అయితే, ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాల కారణంగా రాజకీయంగా ఎక్కడా కనిపించే పరిస్థితి కూడా లేకుండా పోయిందని అంటున్నారు పరిశీలకులు. ఇప్పుడు అసలు పండుల రవీంద్రబాబు ఎక్కడ ఉన్నారో కూడా ఎవరూ చెప్పలేని పరిస్తితి ఏర్పడడం గమనార్హం.