శశికళ ఇన్.. ఆయన అవుట్..?

జయలలిత నెచ్చలి శశికళ రాక కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. శశికళ త్వరలో విడుదల అవుతుందన్న వార్తలు వస్తుండటంతో ఆమె రాకకోసం మేనల్లుడు దినకరన్ ప్రత్యేకంగా ఏర్పాట్లు [more]

Update: 2020-08-17 18:29 GMT

జయలలిత నెచ్చలి శశికళ రాక కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. శశికళ త్వరలో విడుదల అవుతుందన్న వార్తలు వస్తుండటంతో ఆమె రాకకోసం మేనల్లుడు దినకరన్ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. శశికళ నివాసం ఉండేందుకు పోయెస్ గార్డెన్ సమీపంలోనే ఒక బంగళాను సిద్ధం చేస్తున్నారు. పోయెస్ గార్డెన్ సమీపంలోనే శశికళ ఇక ఉండనున్నారు. అక్కడి నుంచే రాజకీయాలు నడపనున్నారు. ఇందుకోసం దినకరన్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

మూడేళ్ల జైలు శిక్ష…..

శశికల జయలలిత అక్రమాస్తుల కేసులో మూడేళ్ల నుంచి పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. శశికళకు ఈ కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. అయితే సత్ప్రవర్తన కారణంగా శశికళ ముందే విడుదల అవనున్నట్లు వార్తలు వస్తున్నాయి. శశికళ విడుదలకు బీజేపీ కూడా సానుకూలంగా ఉండటంతో ఆమె త్వరలోనే బయటకు వస్తారని చెబుతున్నారు. శశికళ కోసం నివాసం, ప్రత్యేక కార్యాలయం కూడా ముస్తాబవుతోంది.

ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న….

శశికళకు సంబంధించిన ఏర్పాట్లను ఆమె మేనల్లుడు దినకరన్ దగ్గరుండి చూసుకుంటున్నారు. వచ్చే ఏడాది తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో శశికళను కీలకం చేయాలన్నది బీజేపీ వ్యూహంగా ఉంది. అన్నాడీఎంకేను ఆమె చేతికే అప్పగిస్తే అత్యధిక స్థానాలను సాధించవచ్చన్నది కమలనాధుల ఆలోచన. అందుకే శశికళ త్వరగా బయటకు వస్తారన్న ప్రచారం ఊపందుకుంది. ఈ మేరకు అన్నాడీఎంకే మంత్రులు సయితం ఆమె రాక కోసం ఎదురు చూస్తున్నారు.

పన్నీర్ సెల్వం మాత్రం…

శశికళ కు అన్నాడీఎంకే పగ్గాలు అప్పగిస్తే పన్నీర్ సెల్వం మాత్రం పార్టీలో ఉండే అవకాశం లేదంటున్నారు. ఆయన ఇప్పటికే బీజేపీకి దగ్గరయ్యారంటున్నారు. జైలుకు వెళ్లేముందు శశికళ జయలలిత సమాధి వద్ద పన్నీర్ సెల్వంపై ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే. శశికళ తిరిగి పార్టీలోకి వస్తే పన్నీర్ సెల్వం బీజేపీ గూటికే చేరతారంటున్నారు. ఇప్పటికే ఆయన కుమారుడు ఎంపీగా బీజేపీ నేతలకు దగ్గరగా మలుచుకుంటున్నారు. శశికళ అన్నాడీఎంకేలోకి వస్తే తొలి టార్గెట్ తానే అవుతానని భావించిన పన్నీర్ సెల్వం సర్దుకుంటున్నట్లు చెబుతున్నారు. ఆయన ప్రయాణం కమలం వైపు ఉండే అవకాశముంది.

Tags:    

Similar News